ఏపీ సీఎం చంద్రబాబుపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం

byసూర్య | Sun, Oct 13, 2024, 10:29 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై బీఆర్‌ఎస్‌ లీడర్ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐపీఎస్‌ పీవీ సునీల్‌కుమార్‌ మీద క్రమశిక్షణ చర్యల పేరుతో ఏపీ సర్కార్ దాడి చేయడాన్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. సునీల్‌కుమార్‌ ట్విట్టర్‌లో పెట్టిన పోస్టులో తప్పేముందని ఏపీ ప్రభుత్వాన్ని ఆర్ఎస్పీ ప్రశ్నించారు. "మీ విజ్ఞతకే వదిలేస్తున్నా.." అని అనడం సర్వీస్‌ రూల్స్‌ ఉల్లంఘన ఎలా అవుతుందని నిలదీశారు. ఒకసారి రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19ను మళ్లీ చదవాలని.. అప్పుడైనా విషయం అర్థమవుతుందేమోనంటూ చంద్రబాబు ప్రభుత్వాన్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎద్దేవా చేశారు.


ఐఏఎస్ అధికారులపై ప్రభుత్వాలు ఇలాగే దాడులు చేస్తే.. అఖిల భారత సర్వీసు అధికారులు ఎవరూ కూడా ప్రజలకు సేవ చేయడానికి ఆసక్తిని చూపించరని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అసహనం వ్యక్తం చేశారు. అనుభవజ్ఞుడైన అడ్మినిస్ట్రేటర్‌ను అని చెప్పుకుంటూ ఇలా దౌర్జన్యాలను నిరంతరం కొనసాగిస్తున్నందుకు విచారంగా ఉందంటూ.. చంద్రబాబు నాయుడును ఉద్దేశిస్తూ.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శలు గుప్పించారు.


వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో 2021 మే 14తన తనను రాజద్రోహం కేసులో అరెస్టు చేసి చిత్రహింసలకు గురిచేశారని.. చంపేందుకు కూడా ప్రయత్నించారంటూ.. ఇటీవల ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు ఇచ్చిన ఫిర్యాదును చంద్రబాబు ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ కేసులో ఏపీ సీఐడీ మాజీ చీఫ్‌ పీవీ సునీల్‌కుమార్‌తో పాటు మరికొందర్ని నిందితులుగా చేర్చుతూ ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించింది. ఈ వ్యవహారంలో ఇటీవల పీవీ సునీల్‌ కుమార్‌ ట్విట్టర్‌ వేదికగా ఘాటుగా స్పందించారు.


"సుప్రీంకోర్టులో మూడేళ్లు నడిచి, సాక్షాత్తూ సుప్రీంకోర్టు తిరస్కరించిన కేసులో కొత్తగా ఎఫ్‌ఐఆర్‌ వేయడాన్ని ఏమనాలో మీ విజ్ఞతకే వదిలేస్తున్నా.." అంటూ ఏపీ సర్కారు నిర్ణయంపై సునీల్‌ కుమార్‌ బహిరంగంగానే తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అయితే.. సునీల్‌ కుమార్‌ చేసిన ట్వీట్‌లో ప్రస్తావించిన వ్యాఖ్యలు.. అఖిల భారత సర్వీస్‌ ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కిందకు వస్తాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంది. సునీల్ కుమార్ దుష్ప్రవర్తనకు పాల్పడ్డారంటూ ఆయనపై అభియోగాలు నమోదు చేసి.. చర్యలకు ఉపక్రమించింది చంద్రబాబు సర్కారు. ఈ వ్యవహారంపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.


అయితే.. ఏపీలో ఇప్పటికే.. పలువురు ఐపీఎస్ ఆఫీసర్లపై చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. ఓ బాలీవుడ్ నటికి సంబంధించిన కేసులో ముగ్గురు ఐపీఎస్ ఆధికారులపై వేటు వేసింది. కాగా.. ఇప్పుడు మరో ఐపీఎస్ అధికారిపై కూడా చర్యలు తీసుకోవటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో.. ఏపీ, తెలంగాణ కేడర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కాగా.. చంద్రబాబు తీసుకుంటున్న చర్యలతో అధికారులు ఏపీ కేడర్‌కు వెళ్లేందకు జంకుతున్నట్టు తెలుస్తోంది.



Latest News
 

ఆ విషయంలో కాంగ్రెస్ సర్కార్‌‌ భేష్..‌ ఇదే ఆనవాయితీ కొనసాగించాలి.. బండి సంజయ్ ప్రశంసలు Sat, Nov 02, 2024, 11:24 PM
ఆ పుణ్యక్షేత్రాలకు స్పెషల్ బస్సులు, ఆ ఛార్జీలు కూడా తగ్గింపు Sat, Nov 02, 2024, 11:20 PM
మెదక్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే మృతి Sat, Nov 02, 2024, 11:16 PM
బీఆర్ఎస్ జాతకాలు మా దగ్గరున్నాయి.. అవన్నీ చెప్తే తట్టుకోలేరు.. అసదుద్దీన్ ఒవైసీ సంచలన కామెంట్లు Sat, Nov 02, 2024, 09:38 PM
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. తెలంగాణలోని ఈ జిల్లాల్లో వర్షాలు Sat, Nov 02, 2024, 09:36 PM