ప్రతి ఏటా దసరాను కొండారెడ్డిపల్లిలో జరుపుకుంటున్న రేవంత్ రెడ్డి

byసూర్య | Sat, Oct 12, 2024, 05:17 PM

దసరా పండుగ రోజున తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంతూరికి వెళ్లారు. సీఎం హోదాలో తొలిసారిగా నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లికి విచ్చేశారు. ప్రతి సంవత్సరం విజయదశమి పండుగను రేవంత్ రెడ్డి తన స్వగ్రామం కొండారెడ్డిపల్లిలోనే జరుపుకుంటారు. ఈసారి సీఎంగా సొంతూరిలో వేడుకలు జరుపుకుంటుండడం విశేషం. కాగా, రేవంత్ రెడ్డికి గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. తన పర్యటన సందర్భంగా రేవంత్ రెడ్డి నూతన పంచాయతీ భవనం, వెటర్నరీ హాస్పిటల్, అమర జవాను యాదయ్య మెమోరియల్ లైబ్రరీ, బీసీ సామాజిక భవనాలను ప్రారంభించారు. సీఎం రాక నేపథ్యంలో అధికారులు కొండారెడ్డిపల్లిలో భారీగా ఏర్పాట్లు చేశారు.


Latest News
 

రేపు ప్రధాని సభకు 2 వేల మందితో భద్రత: సీపీ సుమతి Sat, May 09, 2026, 05:51 PM
హైదరాబాద్‌ను సిగ్నల్ ఫ్రీ సిటీగా మార్చాలి: సీఎం రేవంత్ రెడ్డి Sat, May 09, 2026, 05:50 PM
తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులపాటు వర్షాలు: వాతావరణ శాఖ Sat, May 09, 2026, 04:27 PM
అన్‌ లోడింగ్‌ను రెట్టింపు వేగంతో పూర్తి చేయాలి: కలెక్టర్ Sat, May 09, 2026, 04:26 PM
మైనారిటీలకు గుడ్‌న్యూస్‌.. స్కిల్ డెవలప్‌మెంట్ డిగ్రీ కళాశాలల ఏర్పాటు Fri, May 08, 2026, 09:58 PM