హైదరాబాదీ క్రికెటర్ మహ్మద్ సిరాజ్‌కు డీఎస్పీ పోస్ట్

byసూర్య | Fri, Oct 11, 2024, 08:30 PM

టీమిండియా స్టార్‌ బౌలర్‌, హైదరాబాదీ పేసర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌ తెలంగాణ రాష్ట్రంలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్‌ పోలీస్‌గా (డీఎస్పీ) నియామక పత్రాన్ని అందుకున్నారు.తెలంగాణ డీజీపీ జితేందర్‌ సిరాజ్‌కు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిరాజ్‌తో పాటు రాజ్యసభ సభ్యుడు అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ఉన్నారు.టీ20 వరల్డ్‌కప్‌-2024 గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న సిరాజ్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గ్రూప్‌-1 ఉద్యోగాన్ని ఆఫర్‌ చేసిన విషయం తెలిసిందే. సిరాజ్‌కు డీఎస్పీ ఉద్యోగంతో పాటు జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 78లో 600 చదరపు గజాల స్థలాన్ని కూడా కేటాయించారు. తనకు ఉద్యోగం ఇవ్వడంతో పాటు స్థలాన్ని కేటాయించిన తెలంగాణ ప్రభుత్వానికి సిరాజ్‌ కృతజ్ఞతలు తెలిపారు.30 ఏళ్ల సిరాజ్‌ 2017లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసి టీమిండియా ఆల్‌ ఫార్మాట్‌ ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు. సిరాజ్‌ టీ20 వరల్డ్‌కప్‌-2024తో పాటు అంతకుముందు జరిగిన ఆసియా కప్‌లో విశేషంగా రాణించాడు. సిరాజ్‌ తన తండ్రి చనిపోయాడన్న వార్త తెలిసి కూడా ఆస్ట్రేలియాలో అద్భుతాలు చేశాడు.సిరాజ్‌ ఇప్పటివరకు టీమిండియా తరఫున 28 టెస్ట్‌లు, 44 వన్డేలు, 16 టీ20లు ఆడాడు. ఇందులో 161 వికెట్లు పడగొట్టాడు. సిరాజ్‌ అందరూ బౌలర్లలా కాకుండా ఆల్‌ ఫార్మాట్‌ బౌలర్‌గా రాటుదేలాడు. ఐపీఎల్‌ ద్వారా సిరాజ్‌ ప్రతిభ వెలుగులోకి వచ్చింది. సిరాజ్‌ ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తరఫున ఆడతాడు. ఐపీఎల్‌లో అతను 93 మ్యాచ్‌లు ఆడి 93 వికెట్లు పడగొట్టాడు.


Latest News
 

చేతిలో జొన్నకర్ర, మరో చేతిలో బతుకమ్మ ఉండాలన్న కవిత Sat, Dec 14, 2024, 07:43 PM
మైనార్టీలు అధికారం కలిగి ఉండడాన్ని ఎవరూ ఇష్టపడడం లేదంటూ విమర్శ Sat, Dec 14, 2024, 07:41 PM
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక.. సర్వే ప్రారంభం, ఈ నెలాఖరు డెడ్‌లైన్ Sat, Dec 14, 2024, 07:31 PM
అమెరికాకు గులాబీ బాస్ కేసీఆర్.. ఎన్ని రోజుల టూర్ Sat, Dec 14, 2024, 07:22 PM
గవర్నమెంట్ హాస్పిటల్‌లో నర్సుల డ్యాన్స్.. రోగులను వదిలేసి కోలాటాలతో నృత్యాలు Sat, Dec 14, 2024, 07:12 PM