byసూర్య | Fri, Oct 11, 2024, 11:28 AM
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో దసరా రోజే భారత్, బంగ్లాదేశ్ టీ20 మ్యాచ్ జరుగనుంది. దీంతో అభిమానులు దసరా ధమాకా మ్యాచ్ పట్ల సూపర్ క్రేజ్‌తో ఉన్నారు. తొలి రెండు మ్యాచుల్లో ఏకపక్ష విజయాలు సాధించిన టీమిండియా 2-0తో ఇప్పటికే సిరీస్‌ను సొంతం చేసుకుంది. మూడో మ్యాచ్‌లోనూ నెగ్గి క్లీన్‌స్వీప్‌పై టీమిండియా కన్నేసింది. ఈ మ్యాచ్ కోసం అభిమానులు సైతం ఆతృతగా ఎదురు చూస్తున్నాను.