తెలంగాణకు మళ్లీ రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

byసూర్య | Sun, Sep 29, 2024, 10:52 PM

తెలంగాణకు హైదరాబాద్ వాతావరణశాఖ మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా రాగల రెండు రోజుల్లో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడుతాయని తెలిపింది.


నేడు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, ఆదిలాబాద్‌, కొమురంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్‌, నిర్మల్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, జయశంకర్‌ భూపాలపల్లి, వరంగల్‌, హన్మకొండ, జనగాం జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని అన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేసారు.


పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలకు అవకాశం ఉందని తెలిపారు. పిడుగులు కూడా పడే ఛాన్స్ ఉంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గంటకు 40-50 కి. మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఉందన్నారు. ఇక ఉష్ణోగ్రతల విషయానికొస్తే.. తెలంగాణలో గరిష్ఠంగా 33 డిగ్రీల సెల్సియస్ ఉండే ఛాన్స్ ఉందని చెప్పారు. కనిష్ఠంగా 23 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఉంటాయని అన్నారు.


హైదరాబాద్‌లో పొడి వాతావరణం ఉంటుందని.. ఉదయం ఎండగా ఉన్నా సాయంత్రానికి వాతావరణం చల్లబడి వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు చెప్పారు. అయితే భారీ వర్షాలకు మాత్రం అవకాశం లేదన్నారు. ఓ మోస్తరు జల్లులు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్ అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో రోడ్లపైకి వర్షం నీరు వచ్చి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. నేడు అంతగా వర్షాలు లేకపోవటంతో ప్రజలు ఊపిరి పీల్చుకోవచ్చు.


ప్రస్తుత నైరుతి సీజన్‌లో ఇప్పటి వరకు తెలంగాణలో 71.73 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. అయితే ఈసారి వర్షాలు ఎక్కువగా కురవటంతో 94.82 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. సాధారణ వర్షపాతం కంటే 23 శాతం అధికంగా వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు.


Latest News
 

ట్రాన్స్‌జెండర్లకు రేవంత్ సర్కార్ మరో శుభవార్త.. ఇక నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆ సేవలు ఉచితం.. Sun, Sep 29, 2024, 11:31 PM
ఇంచు భూమి కూడా వదలొద్దు.. త్వరలోనే కొత్త చట్టం.. మంత్రి కీలక ఆదేశాలు Sun, Sep 29, 2024, 11:29 PM
హైదరాబాద్‌లో షాకిస్తోన్న ఇళ్ల ధరలు.. 32 శాతం జంప్.. చదరపు అడుగు ఎంతంటే? Sun, Sep 29, 2024, 11:28 PM
విజయవాడ వెళ్లే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త బస్సులు Sun, Sep 29, 2024, 11:26 PM
ఆ మార్గంలో రోడ్డు విస్తరణ.. ఇక ట్రాఫిక్ కష్టాలు తీరినట్టే Sun, Sep 29, 2024, 11:24 PM