తెలంగాణ ఆర్టీ తీపి కబురు.. దసరా నుంచి ఇంటింటికి, ఇక ఇబ్బందుల్లేవ్

byసూర్య | Sun, Sep 29, 2024, 10:49 PM

తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అనేక కొత్త సేవలు ప్రారంభించింది. తాజాగా.. ఇంటింటికి కార్గో సేవలు అందించాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. దసరా నుంచి ఈ సేవల్ని అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. వినియోగదారులు ఆన్‌లైన్‌లో బుక్ చేయగానే సిబ్బంది నేరుగా ఇంటికి వచ్చి వస్తువులను తీసుకెళ్లి ఇచ్చిన అడ్రస్‌లో డెలివరీ చేయనున్నారు.


 ఆర్డర్ పరిమాణాన్ని బట్టి 2/3/4 వీలర్ ద్వారా డెలివరీ చేస్తారు. ముందుగా దీన్ని హైదరాబాద్ నగరంలో ఆ తర్వాత ఇతర జిల్లాల్లోనూ దశలవారీగా అమలు చేయనున్నారు. ప్రస్తుతం కార్గో సేవలు ఒక బస్ స్టేషన్ నుంచి మరో బస్ స్టేషన్ వరకు మాత్రమే కొనసాగుతున్నాయి. ఇలా ఇంటింటికి వెళ్లి పార్శిల్ తీసుకొని డెలివరీ చేయటం ద్వారా వినియోగదారులకు ఇబ్బందులు తప్పనున్నాయి. ఈ సేవల పట్ల వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


నేడు కొత్త బస్సులు ప్రారంభం..


తెలంగాణలోని ఆరు డిపోల నుంచి ఆర్టీసీ ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులను నడపనుంది. కరీంనగర్ -2, వరంగల్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, హైదరాబాద్-2 డిపోల నుంచి బస్సులు నడపనుంది. ముందుగా నేడు కరీంనగర్-2 డిపో నుంచి 35 ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కనున్నాయి. వీటిని మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆర్టీసీ MD సజ్జనార్ ప్రారంభిస్తారు. కరీంనగర్ నుంచి హైదరాబాద్ జేబీఎస్, మంథని, గోదావరిఖని, జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డికి నాన్ స్టాప్ పద్దతిలో ఈ ఎలక్ట్రిక్ బస్సులు నడవనున్నాయి.


ఇక తెలంగాణ ప్రభుత్వం మహిళకు ఉచిత బస్సు రవాణా సౌకర్యం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. మహాలక్ష్మీ పథకంలో భాగంగా ఫ్రీ బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు. దీంతో బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. గతంలో రోజుకు 20 లక్షల మంది ప్రయాణిస్తే.. ఇప్పుడా సంఖ్య డబుల్ కంటే ఎక్కువైంది. దీంతో ఆర్టీసీ ఉన్నతాధికారులు దశలవారీగా కొత్త బస్సులు ప్రవేశపెడుతున్నారు. అందులో భాగంగానే నేడు ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభిస్తున్నారు.



Latest News
 

ట్రాన్స్‌జెండర్లకు రేవంత్ సర్కార్ మరో శుభవార్త.. ఇక నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆ సేవలు ఉచితం.. Sun, Sep 29, 2024, 11:31 PM
ఇంచు భూమి కూడా వదలొద్దు.. త్వరలోనే కొత్త చట్టం.. మంత్రి కీలక ఆదేశాలు Sun, Sep 29, 2024, 11:29 PM
హైదరాబాద్‌లో షాకిస్తోన్న ఇళ్ల ధరలు.. 32 శాతం జంప్.. చదరపు అడుగు ఎంతంటే? Sun, Sep 29, 2024, 11:28 PM
విజయవాడ వెళ్లే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త బస్సులు Sun, Sep 29, 2024, 11:26 PM
ఆ మార్గంలో రోడ్డు విస్తరణ.. ఇక ట్రాఫిక్ కష్టాలు తీరినట్టే Sun, Sep 29, 2024, 11:24 PM