తెలంగాణలో మరో 10 కొత్త డిపోలు.. ఆర్టీసీ కీలక నిర్ణయం

byసూర్య | Fri, Sep 27, 2024, 07:33 PM

తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది.. ఎలక్ట్రిక్‌ బస్సుల కోసం నూతన డిపోలు అవసరమని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా ఎలక్ట్రిక్‌ బస్నుల్ని ప్రవేశపెడుతుండటంతో.. కొత్తగా 10 బస్‌ డిపోలు అవసరమని ఆర్టీసీ ప్రతిపాదించింది. ఆర్టీసీలో 9,158 బస్సులు ఉంటే.. ఇందులో 6,420 సొంతవి కాగా.. 2,738 అద్దె బస్సులు ఉన్నాయి. గతేడాది తెలంగాణ ఆర్టీసీకి రూ.6,833 కోట్లు వ్యయం కాగా.. ఇందులో డీజిల్‌కు రూ.1,522.04 కోట్లు (22.27 శాతం) ఖర్చు అయ్యింది. అందుకే ఆర్టీసీ ఇంధన వ్యయాన్ని తగ్గించుకునేందుకు ఎలక్ట్రిక్‌ బస్సులను తీసుకొస్తోంది.. కొంతకాలంగా ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇప్పటికే కొన్ని బస్సుల్ని కొనుగోలు చేశారు.


ఆర్టీసీ 2019లో 40 ఎలక్ట్రిక్‌ బస్సుల్ని ప్రవేశపెట్టింది.. 2023లో వెయ్యి బస్సుల సరఫరాకు తయారీ సంస్థలతో ఒప్పందం చేసుకుంది. ఇలా దశలవారీగా ఈ ఎలక్ట్రికల్ బస్సులు అందుబాటులోకి వస్తున్నాయి. అలాగే మరో 2,500 ఈ-బస్సుల్ని గ్రాస్‌ కాస్ట్‌ కాంట్రాక్ట్‌లో తీసుకోవాలని ఆర్టీసీ ఆలోచన చేస్తోంది. దీని కోసమే రాష్ట్రంలో పది కొత్త బస్‌ డిపోలు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ భావిస్తోంది.. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపింది. ఒక్కో డిపో ఏర్పాటుకు రూ.10 కోట్ల చొప్పున రూ.100 కోట్లు.. అలాగే ఒక్కో డిపోకు 10 ఎకరాల చొప్పున 100 ఎకరాలు కావాలని ప్రభుత్వాన్ని కోరింది ఆర్టీసీ.


ఈ ఎలక్ట్రిక్ బస్సులకు ఛార్జింగ్‌ కోసం 33 కేవీ హైటెన్షన్‌ విద్యుత్‌ సరఫరా అవసరమని ఆర్టీసీ భావిస్తోంది. కొత్తగా ఏర్పాటు చేయబోయే 10 డిపోలతో పాటు 19 పాత బస్‌ డిపోలకు హైటెన్షన్‌ విద్యుత్‌ సరఫరాకు మరో రూ.232 కోట్లు అవసరం కావాలని ఆర్టీసీ అంచనాలు వేసింది. కొత్తగా ఏర్పాటు చేయబోయే డిపోలతో పాటుగా హైదరాబాద్‌లోని కోఠి, హయత్‌నగర్‌ వంటి 10 టెర్మినల్‌ పాయింట్లలో ఇంటర్మీడియట్‌ ఛార్జింగ్‌ స్టేషన్లు అవసరమని చెబుతోంది ఆర్టీసీ. దీని కోసం ఒక్కోచోట 2 వేల చదరపు మీటర్ల స్థలం కావాలని.. ఇంటర్మీడియట్‌ ఛార్జింగ్‌ స్టేషన్లకు రూ.6 కోట్ల చొప్పున రూ.60 కోట్ల ఖర్చవుతుందని లెక్కలు వేసింది. మొత్తం మీద ఆర్టీసీ తెలంగాణలో ఎలక్ట్రిక్ బస్సులకు ప్రాధాన్యం ఇస్తోంది.


Latest News
 

చూపు మందగించిందని హాస్పిటల్ వెళితే.. కన్నే తీసేశారు Fri, Sep 27, 2024, 09:07 PM
హాలీవుడ్‌లో కరీనంగర్ కుర్రాడి సత్తా.. 14 రోజుల్లోనే సినిమా Fri, Sep 27, 2024, 09:04 PM
తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో మాధవీలత భజనా కార్యక్రమం.. ఆశ్చర్యంలో ప్రయాణికులు Fri, Sep 27, 2024, 09:02 PM
ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే లైసెన్సుల రద్దు,,,,కఠిన నిబంధనలు అమలు చేయాలని ఆదేశం Fri, Sep 27, 2024, 08:58 PM
తెలంగాణకు రిలయన్స్ ఫౌండేషన్ భూరి విరాళం.. ఏకంగా రూ.20 కోట్లు Fri, Sep 27, 2024, 08:56 PM