హైదరాబాద్‌లో కలకలం.. 15 చోట్ల ఈడీ సోదాలు.. ఆ ఇద్దరు మంత్రులే టార్గెట్!

byసూర్య | Fri, Sep 27, 2024, 07:29 PM

హైదరాబాద్‌లో మరోసారి ఈడీ దాడులు కలకలం రేపుతున్నాయి. నగరంలోని 15 ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం ఉదయం సోదాలు నిర్వహించింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసాలపై సోదాలు చేసినట్టు తెలుస్తోంది. గతంలో ఎన్నికల సమయంలో ఆయన నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు మరో మంత్రి నివాసంలోనూ దాడులు చేసినట్టు సమాచారం. ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ అధికారులు.. హైదరాబాద్‌లో ఏకకాలంలో 15 చోట్ల తనిఖీలు చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత కొద్ది రోజులుగా దూకుడు తగ్గించిన ఈడీ.. మళ్లీ దాడులును షురూ చేసింది. రేవంత్ రెడ్డి క్యాబినెట్‌లోని ఇద్దరు మంత్రులను ఈడీ టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది.


తమకు అందిన సమాచారం మేరకే ఈడీ దాడులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. మనీలాండరింగ్, ఇతర విషయాల్లో సమాచారం అందడంతోనే ఈ సోదాలు నిర్వహిస్తున్నారని తెలియ వచ్చింది. అయితే ఎక్కడ? ఎవరి నివాసాలు? కార్యాలయాల్లో దాడులు నిర్వహిస్తున్నారన్నది మాత్రం గోప్యంగా ఉంచారు. ఓ మంత్రి, ఆయన బంధువు, అనుచరుల ఇళ్లలో సోదాలు జరుగుతున్నట్టు సమాాచారం. హిమాయత్ సాగర్ ఫామ్‌హౌస్, జూబ్లీహిల్స్, హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఈ తనిఖీలు నిర్వహిస్తున్న తెలుస్తోంది. ఆయన కుమార్తె, బంధువుల ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి.


సోదాల సందర్భంగా ఎలాంటి ఘర్షణ, గొడవలు జరగకుండా సీఆర్‌పీఎఫ్ జవాన్లతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటుచేశారు. భారీ భద్రత నడుమ అధికారుల సోదాలు జరుగుతున్నాయి. అయితే, మంత్రి వ్యాపారాలపై ఈడీ ప్రధానంగా దృష్టి సారించినట్టు భోగట్టా. ఏకకాలంలో ఈడీ తనిఖీలు జరగడం కలకలం రేగుతోంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సింది.


కాగా, ఈ దాడులపై అధికార కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే కేంద్రంలో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం.. ఈడీ, సీబీఐలతో దాడులు చేయిస్తోందని ఆరోపిస్తున్నారు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు. రాజకీయ ప్రత్యర్థుల ఇళ్లపై ఐటీ, సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు ఏజెన్సీలను పంపి.. తన రాజకీయ ప్రయోజనాల కోసం వారిని కాషాయ పార్టీ వాడుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


కాగా, పొంగులేటి శ్రీనివాస రెడ్డి కుమారుడు రాఘవ కన్ స్ట్రక్షన్స్ వ్యవహారాలను చూస్తుంటారు. చిన్న వయసులోనే మంచి వ్యాపారవేత్తగా ఎదిగిన ఆయన పేరిట రూ.1300 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఆ క్రమంలో వరుసగా ఈడీ దాడులు జరుగుతున్నాయనే ప్రచారం సాగుతోంది. మొత్తానికి పొంగులేటి నివాసాల్లో ఈడీ వరుస దాడులు రాజకీయాల్లో తీవ్ర చర్చకు తెర లేచింది.


Latest News
 

చూపు మందగించిందని హాస్పిటల్ వెళితే.. కన్నే తీసేశారు Fri, Sep 27, 2024, 09:07 PM
హాలీవుడ్‌లో కరీనంగర్ కుర్రాడి సత్తా.. 14 రోజుల్లోనే సినిమా Fri, Sep 27, 2024, 09:04 PM
తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో మాధవీలత భజనా కార్యక్రమం.. ఆశ్చర్యంలో ప్రయాణికులు Fri, Sep 27, 2024, 09:02 PM
ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే లైసెన్సుల రద్దు,,,,కఠిన నిబంధనలు అమలు చేయాలని ఆదేశం Fri, Sep 27, 2024, 08:58 PM
తెలంగాణకు రిలయన్స్ ఫౌండేషన్ భూరి విరాళం.. ఏకంగా రూ.20 కోట్లు Fri, Sep 27, 2024, 08:56 PM