దసరాకు దద్దరిల్లిపోయే స్కీం.. రూ.100కే 10 కిలోల మేక, 2 ఫుల్ బాటిళ్లు, కాటన్ బీర్లు

byసూర్య | Fri, Sep 27, 2024, 07:08 PM

తెలంగాణలో ఘనంగా జరుపుకునే అతిపెద్ద పండగ దసరా. ఈ పండగకు ఎక్కడెక్కడో ఉండే వాళ్లంతా సొంతూళ్లకు చేరుకుని దోస్తులందరూ కలిసి ధూం ధాంగా పండగ జరుపుకుంటుంటారు. సాధారణంగా.. దసరా వచ్చిందంటే చాలు బట్టల దుకాణాలు, ఈ- కామర్స్ వెబ్ సైట్లు పెద్ద ఎత్తున ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటాయి. మరి దసరా పండగ అంటే.. చుక్కా ముక్కా పక్కాగా ఉండాల్సిందే. దీంతో.. మటన్ దుకాణాలు, చికెన్ షాపులు కూడా కస్టమర్లను ఆకర్షించేందుకు రకరకాల ఆఫర్లు పెడుతుంటాయి. ఈ క్రమంలోనే.. ఓ గ్రామంలో యువకులు వినూత్నంగా ఆలోచించారు. ఈసారి దసరా నిరుడు లెక్కుండది.. అన్న డైలాగును గట్టిగా చెప్పేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే.. దద్దరిల్లే స్కీంను తీసుకొచ్చారు నల్గొండ జిల్లా మునుగోడు మండలంలోని వెల్మకన్నె గ్రామంలోని యువకులు.


2024 దసరాకు బంపర్ ఆఫర్ అంటూ.. "రూ.100 కొట్టు మేకను పట్టు" అనే పథకాన్ని తీసుకొచ్చారు. ఈ స్కీంలో ఏకంగా 5 అదిరిపోయే బహుమతులను ప్రకటించారు. ఆ బహుమతులను చూసిన జనాలు కూడా టెంప్ట్ అవుతున్నారు. గ్రామానికి చెందిన కొందరు యువకులు త్వరలో వస్తున్న దసరా పండగ కోసం.. "రూ.100 కొట్టు మేకను పట్టు" అనే స్కీంను తీసుకొస్తున్నట్టు గ్రామంలో ఓ బ్యానర్ ఏర్పాటు చేశారు. దీంతో.. ఈ దద్దరిల్లిపోయే స్కీం వెలుగులోకి వచ్చింది.


గ్రామస్తుల కోసం ఒక్కో కూపన్ ధర రూ.100గా నిర్ణయించారు. అక్టోబర్ 12న దసరా పండగా కాగా.. అక్టోబర్ 10న సాయంత్రం 6 గంటలకు లక్కీ డ్రా తీయనున్నారు. అయితే.. ఈ స్కీంలో ఐదురుగు విజేతలను ఎంపిక చేయనున్నారు. ఈ ఐదుగురికి అదిరిపోయే బహుమతులను కూడా ఇవ్వనున్నారు. మొదటి విజేతకు బహుమతిగా 10 కిలోల మేకను ఇవ్వనున్నట్టు ప్రకటించగా.. రెండో బహుమతిగా 2 బ్లెండర్స్ ప్రైడ్ ఫుల్ బాటిళ్లు ఇవ్వనున్నారు. ఇక.. మూడో బహుమతిగా కాటన్ బీర్లు, నాలుగో బహుమతిగా 2 నాటు కోళ్లు, ఐదో బహుమతిగా ఒక రాయల్ స్టాగ్ ఫుల్ బాటిల్ అందించనున్నట్లు ఆ బ్యానర్‌లో ఉంది.


అయితే.. త్వరలోనే ఈ స్కీంకు సంబంధించిన కూపన్‌లను గ్రామస్తులకు అందుబాటులో ఉంచనున్నట్టు చెప్తున్నారు. బస్ స్టాండ్ దగ్గర ఏర్పాటు చేసే కార్యక్రమంలో చిన్న పిల్లతోనే లక్కీ డ్రా తీసి విజేతలకు ప్రకటిస్తామని బ్యానర్‌లో స్పష్టం చేశారు. అంతేకాదు.. ఈ స్కీం నిర్వహకుల పేర్లు, వారి ఫోన్ నెంబర్లను కూడా బ్యానర్ మీద ప్రింట్ చేశారు. కాగా.. వెల్మకన్నె యువకులు ఏర్పాటు చేసిన ఈ బ్యానర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


యువకులు ప్రకటించిన ఈ వినూత్నమైన స్కీం మీద సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో లక్కీ డ్రా పేరుతో చాలా స్కీంలు పెట్టారు.. కానీ ఇలాంటిది ఇదే మొదటిసారి అని కొందరు కామెంట్లు చేస్తే.. ఇప్పటివరకు స్కీంలలో బైకులు, ప్రెజర్ కుక్కర్లు, ఇంట్లో వాడుకునే వంట సామాన్లను గిఫ్టులుగా ఇచ్చేవారు. కానీ.. ఈసారి దసరాకు మాత్రం చుక్కా, ముక్కా అంటూ కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు వెల్మకన్నె గ్రామ యువకులు.


Latest News
 

చూపు మందగించిందని హాస్పిటల్ వెళితే.. కన్నే తీసేశారు Fri, Sep 27, 2024, 09:07 PM
హాలీవుడ్‌లో కరీనంగర్ కుర్రాడి సత్తా.. 14 రోజుల్లోనే సినిమా Fri, Sep 27, 2024, 09:04 PM
తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో మాధవీలత భజనా కార్యక్రమం.. ఆశ్చర్యంలో ప్రయాణికులు Fri, Sep 27, 2024, 09:02 PM
ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే లైసెన్సుల రద్దు,,,,కఠిన నిబంధనలు అమలు చేయాలని ఆదేశం Fri, Sep 27, 2024, 08:58 PM
తెలంగాణకు రిలయన్స్ ఫౌండేషన్ భూరి విరాళం.. ఏకంగా రూ.20 కోట్లు Fri, Sep 27, 2024, 08:56 PM