హైదరాబాద్‌ నుంచి 2 గంటల్లోనే అయోధ్యకు.. టికెట్ ధర ఎంతంటే..?

byసూర్య | Fri, Sep 27, 2024, 06:59 PM

రాములోరి భక్తులకు తీపికబురు. హైదరాబాద్ నుంచి అయోధ్య వెళ్లటం ఇప్పుడు మరింత సులువు కానుంది. ఇప్పటి వరకు అయోధ్య రామున్ని చేరుకునేందుకు ఎంత కాదన్న 30 గంటల సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి వచ్చేది.. కానీ... ఇప్పుడు కేవలం రెండున్నర గంటల్లోనే.. హైదరాబాద్ నుంచి అయోధ్యకు వెళ్లే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. అది కూడా ఈరోజు నుంచే. అదేలాగా అనుకుంటున్నారా..? అక్కడికే వస్తున్నా.. ప్రజల డిమాండ్‌కు తగ్గట్టుగా హైదరాబాద్ నుంచి అయోధ్య, కాన్పూర్, ప్రయాగరాజ్ ప్రాంతాలకు శుక్రవారం (సెప్టెంబర్ 27) నుంచి వరుసగా విమాన సర్వీసులు ప్రారంభించారు. దీంతో.. ఇక భక్తులు అయోధ్యకు కేవలం రెండున్నర గంటల్లోనే చేరుకునే అవకాశం దొరకనుంది.


అయితే... సెప్టెంబర్ 27 నుంచి హైదరాబాద్ టూ అయోధ్యతో పాటు హైదరాబాద్ టూ కాన్పూర్‌కు.. వారానికి 4 రోజుల పాటు సేవలందించే విమాన సర్వీసులను విమానయాన శాఖ ప్రారంభించింది. వీటితో పాటు.. హైదరాబాద్ నుంచి ప్రయాగరాజ్, హైదరాబాద్ నుంచి ఆగ్రాకు వారానికి మూడు రోజులు అందుబాటులో ఉంటే విమాన సర్వీసులు సెప్టెంబర్ 28 నుంచి ప్రారంభం కానున్నాయి.


హైదరాబాద్ నుంచి ప్రయాగరాజ్, అయోధ్యకు వెళ్లే భక్తులు ఈ విమాన సర్వీసులు వినియోగించుకోవాలని కేంద్ర విమానయాన శాఖ సూచిస్తోంది. ఇక ఇప్పటికే హైదరాబాద్ నుంచి అగర్తాల, హైదరాబాద్ నుంచి జమ్మూకు విమాన సర్వీసులు కొనసాగుతుండగా.. ఇప్పుడు కొత్త సర్వీసులు కూడా ప్రారంభించింది.


అయితే.. హైదరాబాద్ నుంచి అయోధ్యకు విమాన ధర సుమారు రూ. 5 వేలు ఉండగా.. హైదరాబాద్ నుంచి ప్రయాగరాజ్‌కు రూ. 5,635గా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక హైదరాబాద్ నుంచి కాన్పూర్ వెళ్లేందుకు టికెట్ ధర రూ. 4,598గా ఉంది. అయితే.. హైదరాబాద్ నుంచి ఒక్క నెలలోనే 7 కొత్త విమాన సర్వీసులు ప్రారంభం కావడంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కేంద్రం అందిస్తోన్న ఈ సేవలను వినియోగించుకుని.. ప్రయాణ సమయాన్ని తగ్గించుకోవాలని సూచించారు.


Latest News
 

చూపు మందగించిందని హాస్పిటల్ వెళితే.. కన్నే తీసేశారు Fri, Sep 27, 2024, 09:07 PM
హాలీవుడ్‌లో కరీనంగర్ కుర్రాడి సత్తా.. 14 రోజుల్లోనే సినిమా Fri, Sep 27, 2024, 09:04 PM
తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో మాధవీలత భజనా కార్యక్రమం.. ఆశ్చర్యంలో ప్రయాణికులు Fri, Sep 27, 2024, 09:02 PM
ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే లైసెన్సుల రద్దు,,,,కఠిన నిబంధనలు అమలు చేయాలని ఆదేశం Fri, Sep 27, 2024, 08:58 PM
తెలంగాణకు రిలయన్స్ ఫౌండేషన్ భూరి విరాళం.. ఏకంగా రూ.20 కోట్లు Fri, Sep 27, 2024, 08:56 PM