ఆకాశన్నంటిన ఉల్లి ధరలు

byసూర్య | Fri, Sep 27, 2024, 05:19 PM

రాష్ట్రంలో ఉల్లి ధరలు వణికిస్తున్నాయి. ప్రస్తుతం కిలో ఉల్లి ధర రూ.60 నుంచి రూ.80 వరకు పలుకుతోంది. దీంతో సామాన్యుల పాలిట శాపంగా మారింది.ప్రస్తుతం మార్కెట్ వెళ్లాలంటేనే భయపడుతున్నారు. ఉల్లి ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో సామాన్యులు ఆందోళనకు గురవుతున్నారు.గతంలో ఉల్లి ధరలు కిలో రూ.20 వరకు పలికిన ధర.. ప్రస్తుతం నాలుగింతలకు ఎగబాకింది. దీంతో సామాన్యులు కొనేందుకు వెనకడుగు వేస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఉల్లి సాగు గణనీయంగా తగ్గింది. మరోవైపు వేసిన పంటలు వరదల ధాటికి కొట్టుకుపోయాయి. రానున్న కాలంలో ఉల్లి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారస్తులు చెబుతున్నారు.తెలంగాణ వ్యాప్తంగా ఉల్లి ధరలు ఘాటెక్కాయి. దాదాపు అన్ని జిల్లాల్లోని మార్కెట్‌లలో రూ. 50 నుంచి 60 వరకు అమ్ముతుండగా.. స్థానిక దుకాణాల్లో కిలో ఉల్లి ధర రూ.70 కు పైగా విక్రయిస్తున్నారు. ఇటీవల టమాట ధరలు వణికించగా.. తాజాగా, ఉల్లి ధరలు పెరగడంతో సామాన్యులు బెంబోలెత్తుతున్నారు. ప్రస్తుతం అన్ని చోట్ల ఇవే ధరలు కొనసాగుతున్నాయి.


ఇక, హైదరాబాద్ విషయానికొస్తే.. ఒక్కో మార్కెట్‌లో ఒక్కో రేటుకు విక్రయిస్తున్నారు. అయితే ఇతర దేశాలకు ఉల్లి ఎగుమతి కారణంగా మలక్ పేటకు వచ్చే ఉల్లి కూడా గణనీయంగా తగ్గింది. దీంతో హైదరాబాద్‌లోని పలు మార్కెట్‌లలో రూ. 70 వరకు విక్రయిస్తున్నారు. మరోవైపు, సామాన్యులు ఉల్లిని కొనడం తగ్గించుకున్నారు. ధరల పెరుగుదల ఫలితంగా అమ్మకాల పరిమాణం కూడా గణనీయంగా తగ్గిందని అంటున్నారు.


Latest News
 

హైదరాబాద్‌లో అవన్నీ బ్యాన్.. ఆమ్రపాలి సంచలన నిర్ణయం Fri, Sep 27, 2024, 07:43 PM
అక్టోబరు 31 వరకు ఆ మార్గాల్లో 12 రైళ్లు రద్దు Fri, Sep 27, 2024, 07:42 PM
హైదరాబాద్ టు శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్.. ఇక రాత్రిళ్లు రయ్యంటూ దూసుకెళ్లొచ్చు Fri, Sep 27, 2024, 07:36 PM
తెలంగాణలో మరో 10 కొత్త డిపోలు.. ఆర్టీసీ కీలక నిర్ణయం Fri, Sep 27, 2024, 07:33 PM
హైదరాబాద్‌లో కలకలం.. 15 చోట్ల ఈడీ సోదాలు.. ఆ ఇద్దరు మంత్రులే టార్గెట్! Fri, Sep 27, 2024, 07:29 PM