స్కూల్లో సరైన సదుపాయాలు లేక విద్యార్థుల అవస్థలు

byసూర్య | Fri, Sep 27, 2024, 04:24 PM

వికారాబాద్ జిల్లా దారూర్  మండల పరిధిలోని నాగారం  గ్రామ యువ నాయకులు కె.మల్లేష్ గౌడ్ ఆద్వర్యంలో  నాగారం గ్రామ  జడ్పీహెచ్ఎస్   హై స్కూలు  విద్యార్థులకు  సరియైన సదుపాయాలు లేకపోవడం పట్ల  విచారం వ్యక్తం చేశారు. బడి పిల్లలకు కనీసం  త్రాగటానికి మంచినీళ్లు లేకపోవడం, అలాగే వంటగది లేకపోవడం, బాత్రూమ్స్ సరిగ్గా లేకపోవడం  వలన విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కోంటున్నారని  ఆందోళన వ్యక్తం చేశారు. అదే విధంగా  ఇతర గ్రామాల నుండి పాఠశాలకు వచ్చే విద్యార్థులకు సరైన సమయానికి బస్సు సౌకర్యం లేకపోవడం వలన విద్యార్థులు టైం కి  పాఠశాలకు రాలేక బడి మానేయ వలసిన పరిస్థితులు వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
దయచేసి ఇప్పటికైనా విద్యార్థుల సమస్యలు తెలుసుకుని  వెంటనే పరిష్కారం చేయగలరని సంబందిత అధికారులకు, అలాగే పాఠశాల హెడ్మాస్టర్ , ఉపాధ్యాయులకి ,జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని   అన్నారు. నాగారం గ్రామంలో ఉన్న విద్యాభిమానులు, గ్రామ పెద్దలు పాఠశాల పరిస్థితుల పట్ల ఎప్పటికప్పుడు పర్యావేక్షిస్తూ పాఠశాల పురోగతికి విద్యార్థుల భావితరానికి  తోడ్పడాలని కోరటం జరిగింది. ఈకార్యక్రమంలో  యువకులు వినోద్ కుమార్, వెంకటేష్, ప్రసాద్, అనిల్,భాస్కర్ తదిరులుపాల్గొన్నారు.


Latest News
 

హైదరాబాద్‌లో అవన్నీ బ్యాన్.. ఆమ్రపాలి సంచలన నిర్ణయం Fri, Sep 27, 2024, 07:43 PM
అక్టోబరు 31 వరకు ఆ మార్గాల్లో 12 రైళ్లు రద్దు Fri, Sep 27, 2024, 07:42 PM
హైదరాబాద్ టు శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్.. ఇక రాత్రిళ్లు రయ్యంటూ దూసుకెళ్లొచ్చు Fri, Sep 27, 2024, 07:36 PM
తెలంగాణలో మరో 10 కొత్త డిపోలు.. ఆర్టీసీ కీలక నిర్ణయం Fri, Sep 27, 2024, 07:33 PM
హైదరాబాద్‌లో కలకలం.. 15 చోట్ల ఈడీ సోదాలు.. ఆ ఇద్దరు మంత్రులే టార్గెట్! Fri, Sep 27, 2024, 07:29 PM