వికారాబాద్ జిల్లాలో జరిగే ఓపెన్ ఎస్ఎస్సి ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా ఏర్పాట్లు

byసూర్య | Fri, Sep 27, 2024, 04:22 PM

వికారాబాద్ జిల్లాలో నిర్వహించే ఓపెన్ ఇంటర్ ఎస్ఎస్సి  పరీక్షలు అక్టోబర్ నేల 3 వ తేది నుండి 9 తేది వరకు జిల్లా లో   జరిగే ఓపెన్ ఎస్ ఎస్ సి, ఇంటర్  పరీక్షలు  నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ సుదీర్  అధికారులకు ఆదేశించారు. గురువారము  అదనపు కలెక్టర్ చాంబర్ లో  విద్యాశాఖ మరియు సంబంధిత  అధికారులతో పరీక్షల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రెండు  పరీక్ష సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని,  పదవతరగతి కి సంబంధించి  జడ్ పి ఎచ్ ఎస్ బాలుర స్కూల్ వికారాబాద్ సెంటర్ నందు 166 మంది విద్యారులు, ఇంటర్మీడియట్ కు సంబంధించి జడ్ పి ఎచ్ ఎస్ బాలికల స్కూల్ వికారాబాద్ సెంటర్ నందు 150   మంది అభ్యర్థులు పరీక్ష రాస్తున్నారని తెలిపారు. ఉదయం 9:30 నుండి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుండి 5 గంటల వరకు  పరీక్షలు జరుగుతాయని తెలిపారు.
పరీక్షా కేంద్రాల వద్ద త్రాగునీరు, మరుగుదొడ్లు ,విద్యుత్ సదుపాయం ఏర్పాటు చేయాలన్నారు.  సెంటర్ల దగ్గరలో ఉన్న జిరాక్స్ సెంటర్లను మూసివేయి౦చాలన్నారు. పరీక్షలో ఎలాంటి కాపీయింగ్ జరగకుండా బందోబస్తు చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షల నిర్వహణకు సూపరింటెండెంట్లు, ఎన్విజిలేటర్లు శిక్షణ ఏర్పాటు చేయాలన్నారు.  అభ్యర్థులను పరీక్షా కేంద్రాలకు చేరవేసేందుకు ఆర్టీసీ బస్సులు సిద్ధంగా ఉండాలని, 9 గంటల లోపు అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలన్నారు. అభ్యర్థులు వారి హాల్ టికెట్లు ఆన్లైన్ లో డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. పరీక్ష జరిగిన సమయంలో  ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకు రాకుడదని , పరీక్షలు పూర్తయ్యే వరకు గట్టి బందోబస్తు  ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు ఆదేశించారు. పరీక్షా కేంద్రాల దగ్గర ఆశ వర్కర్లు ,ఏఎన్ఎంలు మెడికల్ కిట్స్ తో  అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలన్నారు. ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా పరిక్షలు  ప్రశాంత వాతావరణంలో సజావుగా  నిర్వహించేలా రెవిన్యూ, విద్య ,వైద్య, పోలీసు శాఖ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డి ఇ ఓ రేణుక దేవి, సంజీవ్ రెడ్డి ఎస్ ఇ ఎలక్ట్రిసిటీ , ఆర్ టి సి మేనేజర్ అరుణ, అబ్దుల్ అఫీజ్ ఎస్ ఐ ,పద్మా రావు,రామ్ రెడ్డి, నాగ మల్లేశ్వర్ రావు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

చూపు మందగించిందని హాస్పిటల్ వెళితే.. కన్నే తీసేశారు Fri, Sep 27, 2024, 09:07 PM
హాలీవుడ్‌లో కరీనంగర్ కుర్రాడి సత్తా.. 14 రోజుల్లోనే సినిమా Fri, Sep 27, 2024, 09:04 PM
తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో మాధవీలత భజనా కార్యక్రమం.. ఆశ్చర్యంలో ప్రయాణికులు Fri, Sep 27, 2024, 09:02 PM
ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే లైసెన్సుల రద్దు,,,,కఠిన నిబంధనలు అమలు చేయాలని ఆదేశం Fri, Sep 27, 2024, 08:58 PM
తెలంగాణకు రిలయన్స్ ఫౌండేషన్ భూరి విరాళం.. ఏకంగా రూ.20 కోట్లు Fri, Sep 27, 2024, 08:56 PM