పౌష్టికాహారం తోనే సంపూర్ణ ఆరోగ్యం

byసూర్య | Fri, Sep 27, 2024, 04:16 PM

తెలంగాణ పోషణ మాసం సందర్భంగా  ఐసిడిఎస్ ప్రాజెక్టు నల్గొండ వారు గురువారం రోజు తిప్పర్తి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు  స్త్రీలు, బాల బాలికలు, తీసుకోవలసిన జాగ్రత్తలు  పోషక విలువలు పిల్లలకు సమతుల్యత గల ఆహారమును అందించడం ద్వారా బలంగా దృఢంగా ఉంటారని మానసిక వికాసము అభివృద్ధి చెందుతుందని.
ఏ డబ్ల్యు సి సూపర్వైజర్ ఎం జ్యోతి అన్నారు.కిషోర్ బాలికలు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఆమె వివరించారు. బరువు తక్కువ గల పిల్లలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి హెల్త్ సూపర్వైజర్ కే సిలువ వివరించారు. సీజనల్ గా సంక్రమించే వ్యాధులు పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని హ్యాండ్ వాష్ తదితర అలవాట్లను  ఏఎన్ఎం శైలజ నేర్పించారు , విద్యార్థులకు మంచి పోషకాలు గల ఆహార పదార్థాలు తీసుకోవడం చాలా అవసరం  అని హ్యాండ్ వాష్ తదితర అంశాల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు అనంతరం విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు పర్వీన్ సుల్తానా, రజిత, మమత, ఆశ వర్కర్లు దనమ్మ ,సువర్ణ, పార్వతమ్మ, తదితరులు పాల్గొన్నారు‌


Latest News
 

చూపు మందగించిందని హాస్పిటల్ వెళితే.. కన్నే తీసేశారు Fri, Sep 27, 2024, 09:07 PM
హాలీవుడ్‌లో కరీనంగర్ కుర్రాడి సత్తా.. 14 రోజుల్లోనే సినిమా Fri, Sep 27, 2024, 09:04 PM
తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో మాధవీలత భజనా కార్యక్రమం.. ఆశ్చర్యంలో ప్రయాణికులు Fri, Sep 27, 2024, 09:02 PM
ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే లైసెన్సుల రద్దు,,,,కఠిన నిబంధనలు అమలు చేయాలని ఆదేశం Fri, Sep 27, 2024, 08:58 PM
తెలంగాణకు రిలయన్స్ ఫౌండేషన్ భూరి విరాళం.. ఏకంగా రూ.20 కోట్లు Fri, Sep 27, 2024, 08:56 PM