నిరుపేద ప్రజల విముక్తి కోసం పోరాడిన ఐలమ్మ

byసూర్య | Fri, Sep 27, 2024, 04:13 PM

నిరుపేద ప్రజల విముక్తి కోసం దొరలను ఎదిరించి పోరాడిన వీర వనిత చిట్యాల ఐలమ్మ అని రాష్ట్ర ఉత్తమ సర్పంచ్ అవార్డు గ్రహీత పర్వతగిరి  రాజు కొనియాడారు. గురువారం ఆత్మకూరు మండల కేంద్రంలోని చిట్యాల ఐలమ్మ విగ్రహానికి రాష్ట్ర ఉత్తమ సర్పంచ్ అవార్డు గ్రహీత పర్వతగిరి రాజు, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు కమలాపురం రమేష్, మండల వర్కింగ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పరికరాల వాసు ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పర్వతగిరి రాజు మాట్లాడుతూ నిరుపేదలందరూ చిట్యాల ఐలమ్మ ను స్ఫూర్తిగా తీసుకొని నిరుపేద ప్రజల కోసం దొరలను ఎదిరించి పోరాడిన వీర వనిత రజక కులంలో పుట్టడం మా అదృష్టంగా భావిస్తున్నామన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం పోరాడవలసిన సమయం ఆసన్నమైందన్నారు.
యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టడం అభినందనీయమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు అండగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సొసైటీ చైర్మన్ ఎరుకొండ రవీందర్, సొసైటీ డైరెక్టర్లు బూర రాజేందర్ రేవూరు జయపాల్ రెడ్డి, మాజీ సర్పంచ్ నాగేల్లి సామెల్,కాంగ్రెస్ జిల్లా నాయకులు చిమ్మని దేవరాజ్, బరిపట్ల కిరీటి, అలవాల రవి,పెరిమల శ్రీనివాస్, పొదిలి సదయ్య, కాడబోయిన మొగిలి, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

చూపు మందగించిందని హాస్పిటల్ వెళితే.. కన్నే తీసేశారు Fri, Sep 27, 2024, 09:07 PM
హాలీవుడ్‌లో కరీనంగర్ కుర్రాడి సత్తా.. 14 రోజుల్లోనే సినిమా Fri, Sep 27, 2024, 09:04 PM
తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో మాధవీలత భజనా కార్యక్రమం.. ఆశ్చర్యంలో ప్రయాణికులు Fri, Sep 27, 2024, 09:02 PM
ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే లైసెన్సుల రద్దు,,,,కఠిన నిబంధనలు అమలు చేయాలని ఆదేశం Fri, Sep 27, 2024, 08:58 PM
తెలంగాణకు రిలయన్స్ ఫౌండేషన్ భూరి విరాళం.. ఏకంగా రూ.20 కోట్లు Fri, Sep 27, 2024, 08:56 PM