విఎస్ఆర్ డిగ్రీ కళాశాలలో చాకలి ఐలమ్మ జయంతి

byసూర్య | Fri, Sep 27, 2024, 03:28 PM

హుజురాబాద్ మండలం సింగాపూర్ గ్రామంలోని విఎస్ఆర్ డిగ్రీ కళాశాలలో శుక్రవారం ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఇన్చార్జి ప్రిన్సిపల్ శనిగరపు రజిత మాట్లాడుతూ.. సాయుధ పోరాటంలో, నాటి నిజాం నిరంకుశ పాలనకు, భూస్వాముల అరాచకానికి వ్యతిరేకంగా ఐలమ్మ ఉద్యమించిందని అన్నారు.
0వీరనారి ఐలమ్మను మహిళలు అంతా ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఐలమ్మ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని నేటి తరం చైతన్యం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి ప్రిన్సిపాల్ శనిగరపు రజిత, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ గబ్బేటి తిరుపతి, కో -ఆర్డినేటర్ పోతిరెడ్డి హరీష్, తాళ్లపల్లి అజయ్, గట్టు కోమల, శారదా, గణేష్, సతీష్, మహేష్, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.


Latest News
 

చూపు మందగించిందని హాస్పిటల్ వెళితే.. కన్నే తీసేశారు Fri, Sep 27, 2024, 09:07 PM
హాలీవుడ్‌లో కరీనంగర్ కుర్రాడి సత్తా.. 14 రోజుల్లోనే సినిమా Fri, Sep 27, 2024, 09:04 PM
తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో మాధవీలత భజనా కార్యక్రమం.. ఆశ్చర్యంలో ప్రయాణికులు Fri, Sep 27, 2024, 09:02 PM
ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే లైసెన్సుల రద్దు,,,,కఠిన నిబంధనలు అమలు చేయాలని ఆదేశం Fri, Sep 27, 2024, 08:58 PM
తెలంగాణకు రిలయన్స్ ఫౌండేషన్ భూరి విరాళం.. ఏకంగా రూ.20 కోట్లు Fri, Sep 27, 2024, 08:56 PM