రైతన్నల గుండె కోత..!

byసూర్య | Fri, Sep 27, 2024, 03:15 PM

సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రంలో ఉన్న సొసైటీలో అన్నదాతలు రుణమాఫీ కాలేదని నిరసన వ్యక్తం చేస్తే వారిని అక్రమంగా పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లడం సరికాదని బిఆర్ఎస్ అనంతగిరి మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు భూక్య బోస్ ఒక ప్రకటనలో విమర్శలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు ఇవ్వకుండా రైతులను మోసం చేస్తుందని తెలిపారు.
విద్యుత్ 24 గంటలు ఇస్తామని రైతులను నమ్మించి,విద్యుత్ కోతలతో రైతులను ఇబ్బందులు పెడుతున్నారని తెలిపారు. వచ్చే విద్యుత్ సక్రమంగా రాకపోవడం తో రైతుల మోటార్లు కాలిపోతున్నాయని అన్నారు. పట్టించుకోని అసమర్థ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని విమర్శించారు. అనంతగిరి మండల పరిధిలోని కిష్టాపురం, గొండ్రియల, కొత్తగూడెం, గ్రామాల్లో వరద ప్రవాహంతో కొన్ని విలువైన వస్తువులు,ప్రహరీ గోడలు ధ్వంసం కావడం, అలాగే పంట నష్టం, వరద బాధితులకు ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.


Latest News
 

చూపు మందగించిందని హాస్పిటల్ వెళితే.. కన్నే తీసేశారు Fri, Sep 27, 2024, 09:07 PM
హాలీవుడ్‌లో కరీనంగర్ కుర్రాడి సత్తా.. 14 రోజుల్లోనే సినిమా Fri, Sep 27, 2024, 09:04 PM
తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో మాధవీలత భజనా కార్యక్రమం.. ఆశ్చర్యంలో ప్రయాణికులు Fri, Sep 27, 2024, 09:02 PM
ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే లైసెన్సుల రద్దు,,,,కఠిన నిబంధనలు అమలు చేయాలని ఆదేశం Fri, Sep 27, 2024, 08:58 PM
తెలంగాణకు రిలయన్స్ ఫౌండేషన్ భూరి విరాళం.. ఏకంగా రూ.20 కోట్లు Fri, Sep 27, 2024, 08:56 PM