పెద్దపల్లి మండలంలో ప్రభుత్వ పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

byసూర్య | Fri, Sep 27, 2024, 02:48 PM

ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు మెరుగైన విద్య అందించాలని, ఆ దిశగా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని  జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష  పెద్దపల్లి మండలంలో పలు ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. హన్మంతునిపేట గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అంగన్వాడి కేంద్రం, ముత్తారం గ్రామంలో అప్పర్ ప్రైమరీ స్కూల్, అంగన్వాడి కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు.హన్మంతునిపేట పేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో  చదివింది అర్థం చేసుకునేలా విద్యార్థుల గ్రహణ శక్తి మెరుగయ్యేలా చూడాలని అన్నారు. పాఠశాలలో మరమ్మత్తుకు గురైన కంప్యూటర్లను తొలగించాలని, విద్యార్థులకు మధ్యాహ్నం నాణ్యమైన భోజనం అందజేయాలని కలెక్టర్ తెలిపారు.
పాఠశాల ఉపాధ్యాయులు సకాలంలో హాజరు కావాలని, పాఠశాల ప్రాంగణం పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ తెలిపారు. హన్మంతునిపేట అంగన్ వాడి కేంద్రంలో లైట్లు వెంటనే ఏర్పాటు చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అంగన్ వాడి కేంద్రాలలో ఉన్న పిల్లల ఎదుగుదలను రెగ్యులర్ గా మానిటర్ చేయాలని, ఎత్తు తక్కువ, బరువు తక్కువ ఉన్న పిల్లలను గుర్తించి వారికి అవసరమైన అదనపు పౌష్టికాహారం అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు.ఈ తనిఖీ సమయంలో పాఠశాల హెడ్ మాస్టర్ లు జి. దశ రథం, పి.నాగరాజు, ఉపాధ్యాయులు, సంబంధిత అధికారులు, తదితరులు  పాల్గొన్నారు.


Latest News
 

పల్లె దవాఖానా పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న దేవరకొండ ఎమ్మెల్యే Fri, Sep 27, 2024, 04:41 PM
108 అత్యవసర నూతన అంబులెన్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం Fri, Sep 27, 2024, 04:39 PM
అందోలు చెరువు అభివృద్ది పనులను పరిశీలించిన ఈఈ Fri, Sep 27, 2024, 04:36 PM
రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుంది Fri, Sep 27, 2024, 04:30 PM
బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటాం Fri, Sep 27, 2024, 04:27 PM