రోడ్డు ప్రక్కనే బావి రక్షణ గోడ కరువు..పొంచి ఉన్న ప్రమాదం

byసూర్య | Fri, Sep 27, 2024, 02:23 PM

మండలంలోని దొంగల మర్రి సమీపంలో గల రోడ్డు ప్రక్కన మూల మలుపు వద్ద బావి ప్రమాదకర స్థితిలో ఉంది. ఎలాంటి రక్షణ గోడ లేకపోవడం వల్ల ఏ మాత్రం ఏమరపాటుగా వాహనదారులు ప్రయాణించిన ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉన్నది. గత సంవత్సరం జగ్గాసాగర్ నుండి బండలింగాపూర్ వరకు రోడ్డు నిర్మించినప్పటికి రోడ్డు ప్రక్కన గల బావి ప్రక్కన కాంట్రాక్టర్ రక్షణ గోడ నిర్మించకుండా నిర్లక్ష్యం వహించడన్న విమర్శలు వెలువెత్తాయి. నిత్యం మెట్ పల్లి నుండి ఆత్మకూర్ వైపు వందలాది ప్రయానికులతో రద్దీ గా ఉంటుంది.
పదుల సంఖ్యలో ప్రయివేట్ పాఠశాలల బస్సులు, వ్యాన్లు ఈ మార్గం గుండా వెళ్లడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూలమలుపు అవ్వడంతో పెనుప్రమాదం జరగకముందే త్వరితగతిన  రక్షణ గోడ నిర్మచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అధికారులు రక్షణ చర్యలు చేపట్టాలి. రోడ్డు ప్రక్కన మూలమలుపు వద్ద బావి ప్రమాధకరంగా మారడంతో ప్రయానికులు తాత్కాలిక రక్షణ చర్యలు చేపట్టారు. మూలమలుపు  అవ్వడం తో ఏమరపాటు గా ఉన్న పెను ప్రమాదం వాటిల్లుతుంది. కావున సంబంధిత అధికారులు స్పందించి రక్షణ గోడ ఏర్పారచాలి.


Latest News
 

తెలంగాణకు రిలయన్స్ ఫౌండేషన్ భూరి విరాళం.. ఏకంగా రూ.20 కోట్లు Fri, Sep 27, 2024, 08:56 PM
హైదరాబాద్‌లో అవన్నీ బ్యాన్.. ఆమ్రపాలి సంచలన నిర్ణయం Fri, Sep 27, 2024, 07:43 PM
అక్టోబరు 31 వరకు ఆ మార్గాల్లో 12 రైళ్లు రద్దు Fri, Sep 27, 2024, 07:42 PM
హైదరాబాద్ టు శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్.. ఇక రాత్రిళ్లు రయ్యంటూ దూసుకెళ్లొచ్చు Fri, Sep 27, 2024, 07:36 PM
తెలంగాణలో మరో 10 కొత్త డిపోలు.. ఆర్టీసీ కీలక నిర్ణయం Fri, Sep 27, 2024, 07:33 PM