సిరిసిల్ల ప్రజలు, నేతన్నల మీద పగ తీర్చుకుంటున్నారన్న కేటీఆర్

byసూర్య | Thu, Sep 26, 2024, 04:35 PM

రాజకీయంగా తన మీద ఉన్న కోపంతో రాజన్న సిరిసిల్ల ప్రజలు, నేతన్నల మీద పగ తీర్చుకుంటున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వకపోవడంతో నేతన్నల కుటుంబాల రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. సిరిసిల్లలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ హయాంలో నేతన్నల ఆత్మహత్యలు జరిగాయన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే తమ పార్టీ తరఫున రూ.50 లక్షలు పద్మశాలి ట్రస్ట్‌కు ఇచ్చి సిరిసిల్లను ఆదుకున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక నేతన్నల కుటుంబాలకు అండగా నిలిచామన్నారు. కేసీఆర్ నేతన్నలకు ఉపాధి కల్పించి వారి కడుపు నింపారన్నారు. స్కూల్ యూనిఫామ్స్‌తో పాటు కేసీఆర్ కిట్‌లోని రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుకకు ఇచ్చే చీరలను సిరిసిల్లలో తయారు చేయించినట్లు చెప్పారు.కాంగ్రెస్ ప్ర‌భుత్వం దివాళాకోరు నిర్ణ‌యం వ‌ల్ల రాష్ట్రంలోని కోటిమందికి పైగా ఆడ‌బిడ్డ‌ల‌కు బ‌తుక‌మ్మ చీర‌లు బంద్ అయ్యాయని మండిపడ్డారు. బ‌తుక‌మ్మ చీర‌ల పంపిణీ ప‌థ‌కం వెనుక ఉన్న ఉద్దేశం, ఆలోచ‌నపై ఈ సీఎంకు, ప్ర‌భుత్వానికి క‌నీస అవ‌గాహ‌న లేదని విమర్శించారు. నేత‌న్న‌ల స‌మ‌స్య‌ల‌పై అసెంబ్లీలో చెప్పే ప్ర‌య‌త్నం చేశానన్నారు. తన మీద రాజ‌కీయ క‌క్ష‌ ఉంటే తన మీదే తీసుకోవాలని, కానీ నేత‌న్న‌ల‌ను ఇబ్బంది పెట్టవద్దని కోరారు. ఇది దివాళాకోరు, ప‌నికిమాలిన ప్ర‌భుత్వమని ధ్వజమెత్తారు.


Latest News
 

ప్రజల ఆమోదం తీసుకున్నాకే ప్రక్షాళన చేపట్టాలని పటోళ్ల కార్తీక్ రెడ్డి సూచన Fri, Sep 27, 2024, 06:38 PM
ఆకాశన్నంటిన ఉల్లి ధరలు Fri, Sep 27, 2024, 05:19 PM
కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిలో పాల్గొన్న ఫోరం నాయకులు Fri, Sep 27, 2024, 05:12 PM
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు Fri, Sep 27, 2024, 05:09 PM
సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే Fri, Sep 27, 2024, 05:05 PM