బీఆర్ఎస్ కుట్రలు నమ్మవద్దన్న దామోదర రాజనర్సింహ

byసూర్య | Wed, Sep 18, 2024, 08:50 PM

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరిక జారీ చేశారు. గవర్నమెంట్ ఆసుపత్రులను నాశనం చేసే కుట్రలు మానుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ... గాంధీ ఆసుపత్రిపై బురద జల్లడం ద్వారా అక్కడికి వైద్యం కోసం వచ్చే నిరుపేదల మనోస్థైర్యాన్ని దెబ్బతీయడం బాధాకరమన్నారు.గాంధీ, ఉస్మానియా వంటి ప్రభుత్వ ఆసుపత్రులను పదేళ్ల పాటు బీఆర్ఎస్ భ్రష్టు పట్టించిందని ఆరోపించారు. ఇప్పుడు ప్రతిపక్షంలోనూ అదే తరహా కుట్రలు సరికాదన్నారు. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం నాశనం చేసిన వైద్య వ్యవస్థను తాము గాడిన పెడుతున్నామన్నారు. అన్ని సౌకర్యాలు కల్పించే ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్ కుట్ర మాటలు నమ్మవద్దని, ధైర్యంగా ఆసుపత్రికి వచ్చి వైద్యం చేయించుకోవాలని సూచించారు.బీఆర్ఎస్ నేతలు గాంధీ ఆసుపత్రిని సర్వనాశనం చేసి కార్పోరేట్ ఆసుపత్రులకు లబ్ధి చేకూరేలా చూస్తున్నారని విమర్శించారు. పేదలకు ఉపయోగపడే ప్రభుత్వ వ్యవస్థలను నాశనం చేయడం మానుకోకపోతే ప్రజలు బుద్ధి చెబుతారని కేటీఆర్‌ను హెచ్చరించారు.


Latest News
 

నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం కేసులో నోటీసులు జారీ Thu, Oct 10, 2024, 03:54 PM
మాదిగలను నమ్మించేందుకు సీఎం ఎన్నో ప్రకటనలు చేస్తున్నారని విమర్శ Thu, Oct 10, 2024, 03:52 PM
సీఎంను కలిసిన బీసీ సంక్షేమ సంఘం నేతలు Thu, Oct 10, 2024, 03:09 PM
నారాయణపేటలో మోస్తరు వర్షం Thu, Oct 10, 2024, 03:05 PM
జడ్చర్లలో ఓబీసీ మోర్చ ఆధ్వర్యంలో బీజేపీ మెంబర్‌షిప్ డ్రైవ్ Thu, Oct 10, 2024, 03:04 PM