టీవీ చూద్దామని పిలిచి,,,,చిన్నారిని కాటేసిన పక్కింటి కుర్రాడు

byసూర్య | Wed, Sep 18, 2024, 08:19 PM

టీవీ చూద్దామని పిలిచి ఏడేళ్ల బాలికపై 17 ఏళ్ల బాలుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చిన్నారిని ఏమార్చి అత్యాచారం చేశాడు. ఒంటరిగా ఉన్న బాలికను మభ్యపెట్టి దారుణానికి ఒడిగట్టాడు. వివరాల్లోకి వెళితే.. రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని భారతీ నగర్‌ డివిజన్‌ ఇక్రిశాట్‌ ఫెన్సింగ్‌ ఏరియాలో ఓ కుటుంబం నివసిస్తోంది. తల్లిదండ్రులు రోజూవారీ కూలీ పనులకు వెళ్తుండగా.. వారి ఏడేళ్ల కూతురు స్థానిక పాఠశాలలో చదువుకుంటుంది. అయితే మంగళవారం (సెప్టెంబర్ 17) గణేష్ నిమజ్జనం ఉండటంతో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. దీంతో బాలిక ఇంటి వద్దే ఉంది. తల్లిదండ్రులు కూలీ పనుల కోసం బయటకు వెళ్లారు.


ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికను పక్కింట్లో ఉండే 17 ఏళ్ల కుర్రాడు గమనించాడు. మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేరని పక్కాగా నిర్ధారించుకొని చిన్నారి ఇంట్లోకి ప్రవేశించాడు. చిన్నారితో మాటమాట కలిపి టీవీ చూద్దామని చెప్పి ఏమార్చాడు. ఆపై తన ఇంట్లోకి తీసుకెళ్లి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం బాలికను ఇంటికి పంపించాడు. సాయంత్రం చిన్నారి తల్లిదండ్రులు ఇంటికొచ్చే సమయానికి బాలిక తీవ్ర రక్తస్రావంతో ఏడుస్తుంది. ఆందోళనకు గురైన చిన్నారి తల్లిదండ్రులు వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లారు.


పరీక్షించిన డాక్టర్లు చిన్నారిపై అత్యాచారం జరిగిందని నిర్ధారించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. బాలికతో మాట్లాడి వివరాలు తెలుసుకోగా.. పక్కింట్లో ఉండే కుర్రాడు దారుణానికి పాల్పడినట్లు చెప్పింది. చిన్నారి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేసుకున్నారు. మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.


Latest News
 

పదేళ్ల పాటు తాము ఉద్యోగాలు ఇచ్చి కూడా ప్రచారం చేసుకోలేదన్న బీఆర్ఎస్ నేత Thu, Oct 10, 2024, 04:25 PM
నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం కేసులో నోటీసులు జారీ Thu, Oct 10, 2024, 03:54 PM
మాదిగలను నమ్మించేందుకు సీఎం ఎన్నో ప్రకటనలు చేస్తున్నారని విమర్శ Thu, Oct 10, 2024, 03:52 PM
సీఎంను కలిసిన బీసీ సంక్షేమ సంఘం నేతలు Thu, Oct 10, 2024, 03:09 PM
నారాయణపేటలో మోస్తరు వర్షం Thu, Oct 10, 2024, 03:05 PM