బీఆర్ఎస్‌కు హైకోర్టులో చుక్కెదురు.. పార్టీ ఆఫీస్ కూల్చేయాలని ఆదేశం

byసూర్య | Wed, Sep 18, 2024, 08:14 PM

బీఆర్ఎస్ పార్టీకి హైకోర్టులో షాక్ తగిలింది. నల్గొండ కార్యాలయాన్ని 15 రోజుల్లో కూల్చివేయాలని న్యాయస్థానం ఆదేశించింది. పార్టీ నాయకులే కార్యాలయానికి కూల్చివేయాలని.. లేదంటే మున్సిపల్ శాఖ అధికారులు కూల్చేశారని హెచ్చరించింది. పార్టీ ఆఫీసును రెగ్యులర్ చేసేలా మున్సిపల్ శాఖకు ఆదేశాలు ఇవ్వాలని బీఆర్ఎస్ నాయకులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై నేడు విచారణ జరిపిన న్యాయస్థానం.. ఆఫీస్ నిర్మాణం చేయకముందు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి కదా..? అని ప్రశ్నించింది. పార్టీ ఆఫీసు నిర్మించిన తర్వాత ఎలా అనుమతి ఇస్తారని పిటిషనర్‌ను న్యాయమూర్తి ప్రశ్నించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం 15 రోజుల్లో పార్టీ కార్యాలయాన్ని కూల్చేయాలని ఆదేశాలు జారీ చేసింది.


నల్గొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై గతకొన్ని రోజులుగా వివాదం నడుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా రూ. కోట్లు వెచ్చించి పార్టీ ఆఫీసును నిర్మించారని జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ స్థలంలో ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మించిన పార్టీ కార్యాలయాన్ని కూల్చేయాలని ఆయన పట్టుబడట్టారు. మళ్లీ తామే అధికారంలోకి వస్తామన్న ధీమాతో నిబంధనలు అతిక్రమించి కోట్లు ఖర్చు చేసి బిల్డింగులు కట్టారన్నారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనే పార్టీ ఆఫీసుల నిర్మాణంపై కోమటిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి రాగానే వాటిని కూల్చేసి ఆ స్థలంలో ప్రభుత్వ ఆఫీసులు నిర్మిస్తామని చెప్పారు. నాడు చెప్పినట్లుగానే.. అధికారంలోకి రాగానే కూల్చేవేతలకు ఆదేశాలిచ్చారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు హైకోర్టును ఆశ్రయించారు.


బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కోసం ఆగ్రోస్కు చెందిన రెండు ఎకరాల స్థలాన్ని అప్పటి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అనంతరం సీసీఎల్ఏ నుంచి కేవలం రూ.3.50 లక్షలకే పార్టీ ఆఫీసుకు ఆ భూములను కట్టబెట్టింది. నల్గొండ-హైదరాబాద్ రోడ్డు పక్కనే, పట్టణం నడిబొడ్డున ఉన్న ఈ స్థలం విలువ వంద కోట్లు ఉంటుందని అంచనా. అయితే బిల్డింగ్‌ను పూర్తిగా నిర్మించినా.. ప్రారంభానికి మాత్రం నోచుకోలేదు. ప్రారంభం చేయాల్సిన సమయానికే ఎన్నికలు రావటం, ప్రభుత్వం మారటంతో జిల్లా మంత్రి కోమటిరెడ్డి కూల్చివేతలకు ఆదేశాలిచ్చారు. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించగా.. తాజాగా న్యాయస్థానంలో చుక్కెదురైంది. అనుమతి లేకుండా నిర్మించిన పార్టీ ఆఫీసును కూల్చేయాలని న్యాయస్థానం ఆదేశించింది.



Latest News
 

నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం కేసులో నోటీసులు జారీ Thu, Oct 10, 2024, 03:54 PM
మాదిగలను నమ్మించేందుకు సీఎం ఎన్నో ప్రకటనలు చేస్తున్నారని విమర్శ Thu, Oct 10, 2024, 03:52 PM
సీఎంను కలిసిన బీసీ సంక్షేమ సంఘం నేతలు Thu, Oct 10, 2024, 03:09 PM
నారాయణపేటలో మోస్తరు వర్షం Thu, Oct 10, 2024, 03:05 PM
జడ్చర్లలో ఓబీసీ మోర్చ ఆధ్వర్యంలో బీజేపీ మెంబర్‌షిప్ డ్రైవ్ Thu, Oct 10, 2024, 03:04 PM