byసూర్య | Wed, Sep 18, 2024, 07:08 PM
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనతలను ఎప్పటికీ చెరిపివేయలేరని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. గణాంకాలు ఎప్పుడూ అబద్ధం చెప్పవని, కేసీఆర్ ఘనతలు చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. తలసరి ఆదాయంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆర్థిక సలహా మండలి నివేదిక విడుదల చేసిన నేపథ్యంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. చెప్పాల్సిన వాళ్లే చెబుతున్నారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఎంతటి అద్భుతమైన పురోగతి సాధించిందో చెప్పడానికి పీఎం మోదీ ఆర్థిక సలహా మండలి నివేదికే గీటురాయి. జాతీయ తలసరి ఆదాయం సగటు కంటే తెలంగాణ తలసరి ఆదాయం సగటు 94 శాతం అధికం. ఇదంతా కేవలం తొమ్మిదన్నరేళ్లలోనే సాధించాం. కేసీఆర్ తెలంగాణను అన్ని రంగాల్లోనూ అభివృద్ధికి నమూనాగా నిలిపారు" అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.