జానీ మాస్టర్‌పై పోక్సో కేసు నమోదు చేసిన నార్సింగి పోలీసులు

byసూర్య | Wed, Sep 18, 2024, 04:27 PM

జానీ మాస్టర్(Johny Master) కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ ఓ మహిళా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.ఈ ఫిర్యాదుపై స్పందించిన రాయదుర్గం పోలీసులు జీరో ఎఫ్ఐఆర్(Zero FIR) నమోదు చేసి, కేసును బాధితురాలి నివాసం అయిన నార్సింగికి బదిలీ చేశారు. నార్సింగి పోలీసులు బాధితురాలి ఇంటికి వెళ్ళి పూర్తి వివరాలను తెలుసుకొని, కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. నాలుగేళ్ల నుండి జానీ మాస్టర్ తనపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడంటూ పేర్కొనడంతో, బాధితురాలి వయసు రీత్యా జానీ మాస్టర్ మీద పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు.ఇదిలా ఉండగా ప్రస్తుతం జానీ మాస్టర్ పరారీలో ఉన్నట్టు పేర్కొన్న పోలీసులు.. నార్త్ ఇండియాలో ఉన్నట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. 4 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి జానీ మాస్టర్ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు నార్సింగి పోలీసులు తెలిపారు.


Latest News
 

కుల వర్గ వ్యవస్థ నిర్ములన కోసం పోరాడిన వీరుడు పూలే Sat, Apr 11, 2026, 03:29 PM
శంకుస్థాపనలో ప్రోటోకాల్ వివాదం Sat, Apr 11, 2026, 02:37 PM
రేపటి నుంచి 10 రోజుల పాటు తెలంగాణలో తీవ్ర వడగాల్పులు Sat, Apr 11, 2026, 02:35 PM
సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమీక్ష సమావేశం Sat, Apr 11, 2026, 01:56 PM
ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ చేతుల మీదుగా గ్రాండ్ గా "ఐ క్యాబ్స్" ట్రాన్స్ పోర్ట్ సర్వీసెస్ ప్రారంభం Sat, Apr 11, 2026, 01:44 PM