byసూర్య | Wed, Sep 18, 2024, 04:15 PM
సొసైటీ ఫర్ సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కళాశాలలో చదివే బాలికల కోసం ఉచితంగా బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ కృష్ణకుమార్ బుధవారం తెలిపారు. జిన్నారం నుంచి నల్తూరు, కొర్లకుంట, కిష్టయ్య పల్లి, చెట్ల పోతారు, గాగిల్లాపూర్ మీదుగా మళ్లీ జిన్నారం వరకు బస్సు నడుస్తుందని చెప్పారు. మరో బస్సు జన్నారంలోని కళాశాల నుంచి కొడకంచి మాదారం వరకు నడుస్తుందని పేర్కొన్నారు.