byసూర్య | Wed, Sep 18, 2024, 04:13 PM
రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా గణేష్ నిమర్జనోత్సవంఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో జరిగేలా కృషి చేసిన పోలీస్ అధికారులని, సిబ్బందిని ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రత్యేకంగా అభినందించారు. నిమజ్జనం విజయవంతంగా, ప్రశాంతంగా పూర్తయ్యేందుకు సహకరించిన జిల్లా ప్రజలకు, మండపాల నిర్వాహకులకు ఎస్పీ ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.