![]() |
![]() |
byసూర్య | Wed, Aug 14, 2024, 10:08 AM
శారీరకంగా, మానసికంగా మనిషిని నిలువునా కుంగదీసే జబ్బు క్యాన్సర్. ప్రపంచవ్యాప్తంగా గుండె సంబంధిత వ్యాధుల తరవాత క్యాన్సర్‌ల కారణంగానే అధిక సంఖ్యలో అకాల మరణాలు సంభవిస్తున్నాయి. ఈ శతాబ్దం చివరినాటికి క్యాన్సర్లు ఇంకా పెరిగి.. అర్ధాంతర చావులకు కారణం కావచ్చునంటూ వైద్యపరిశోధనలు హెచ్చరించాయి. 2022తో పోలిస్తే 2050 నాటికి పురుషుల్లో క్యాన్సర్ కేసులు 84శాతం, మరణాలు 93శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు అమెరికన్ క్యాన్సర్ సొసైటీ జర్నల్ ఓ అధ్యయనంలో వెల్లడించింది.