హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. రోడ్లపైకి భారీగా వరద, బయటకెళ్లేవారు జాగ్రత్త

byసూర్య | Tue, Aug 13, 2024, 09:44 PM

హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురుస్తోంది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా వరుణుడు దంచికొడుతున్నాడు. జోరువానతో హైదరాబాద్ నగరం తడిసి ముద్దయింది. ప్రధానంగా పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట్, ఎర్రమంజిల్, కూకట్‌పల్లి, ఖైరతాబాద్, లక్డీకపూల్, మాదాపూర్, బాలానగర్, మెుహదీపట్నం, చౌలిచౌకి, యూసఫ్‌గూడ, మసాబ్‌ట్యాంక్ ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. మిగిలిన ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం 6.40 గంటలకు మెుదలైన వాన గంట నుంచి కురుస్తూనే ఉంది.


దీంతో రోడ్లపైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. భారీ వరదతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. పంజాగుట్ట స్మశాన వాటిక సమీపంలో రోడ్డుపైకి మోకాళ్ల లోతు నీరు రావటంతో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. పంజాగుట్ట ఫ్లైఓవర్‌పై దాదాపు కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో రంగంలోకి దగిన జీహెచ్‌ఎంసీ, పోలీసులు డ్రైనేజీ మ్యాన్‌హోల్స్ తెరిచి వర్షం నీరు పోయేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆదివారం రాత్రి కూడా నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. దీంతో పలు కాలనీల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది.


ఇక తెలంగాణలో నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. మరో రెండ్రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని చెప్పారు. నేడు పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, మహబూబాబాద్, జనగాం, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు ఉన్నాయన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణశాఖ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.


భారీ వర్షానికి తోడు ఈదురు గాలులు కూడా వీస్తాయని చెప్పారు. గంటకు 30-40 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు చెప్పారు. కమ్యూలోనింబస్ మేఘాల కారణంగా పలు చోట్ల పిడుగులు పడే ఛాన్స్ ఉందని అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. పొలం పనులకు వెళ్లేవారు చెట్ల కింద ఉండకూడదన్నారు. ఇక గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతన్నాయి. ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి.


Latest News
 

బీఆర్ఎస్ కుట్రలు నమ్మవద్దన్న దామోదర రాజనర్సింహ Wed, Sep 18, 2024, 08:50 PM
టీవీ చూద్దామని పిలిచి,,,,చిన్నారిని కాటేసిన పక్కింటి కుర్రాడు Wed, Sep 18, 2024, 08:19 PM
మత సామరస్యానికి ప్రతీక,,,గణేష్ లడ్డూ దక్కించుకున్న ముస్లిం దంపతులు Wed, Sep 18, 2024, 08:18 PM
ఈ విషాదం ఎవ‌రి పాపం?: కేటీఆర్ Wed, Sep 18, 2024, 08:16 PM
బీఆర్ఎస్‌కు హైకోర్టులో చుక్కెదురు.. పార్టీ ఆఫీస్ కూల్చేయాలని ఆదేశం Wed, Sep 18, 2024, 08:14 PM