తెలంగాణకు రెయిన్ అలర్ట్,,,పలు జిల్లాల్లో భారీ వర్షాలు

byసూర్య | Mon, Aug 12, 2024, 09:30 PM

తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు రెయిన్ అలర్ట్ జారీ చేశారు. ఉపరితల ఆవర్తనం, బలమైన నైరుతి రుతుపవనాల వల్ల రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని చెప్పారు. నేడు, రేపు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని వెల్లడించారు. ప్రధానంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కొత్తగూడెం, నిర్మల్, భూపాలపల్లి, ములుగు, రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ, నారాయణపేట, సంగారెడ్డి, మెదక్, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందన్నారు.


  ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక భారీ వర్షాలకు తోడు ఉరుములు, మెరుపులు కూడా ఉంటాయన్నారు. బలమైన ఈదురు గాలులు కూడా వీస్తాయని చెప్పారు. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలపైకి క్యుములోనింబస్ మేఘాలు వస్తున్నాయని.. ఈ మేఘాల వల్ల ఉరుములు, మెరుపులు కూడా వస్తాయన్నారు. నల్లమబ్బు కమ్ముకుంటుందని.. పిడుగులు పడే అవకాశం కూడా ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.


కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్ గేటు.. భారీగా నీటి వృథా


ప్రస్తుతం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దిల్‌సుఖ్ నగర్, మలక్‌పేట్, ముసారంబాగ్, కోఠి, చాదర్‌ఘాట్, అంబర్‌పేట తదితర ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. దీంతో ఉదయం ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై భారీగా నీరు నిలిచిపోవటంతో జీహెచ్‌ఎంసీ అధికారులు వాటిని తొలగించే పనిలో నిమగ్నమయ్యారు.


ఇదిలా ఉండగా.. గత కొద్ది రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జూన్ మాసంలో వర్షాలు అంతగా కురవకపోయినా.. జులై చివరి వారం నుంచి దంచికొడుతున్నాయి. దీంతో రాష్ట్రంలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, జలాశయాలు, ప్రాజెక్టులు నిండు కుండలా మారాయి. దాదాపు రెండేళ్ల తర్వాత శ్రీశైలం, నాగార్జున సాగర్ గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. ఇలా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తెలంగాణలోని పలు జిల్లాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి తరుణంలో మరోసారి వర్షం హెచ్చరికలు జారీ చేయటంతో ప్రజలు, రైతులు ఆందోళన చెందుతున్నారు.


Latest News
 

బాలికపై హత్యాచారం చేసిన నిందితుడికి ఉరిశిక్ష విధించిన సంగారెడ్డి జిల్లా కోర్టు Thu, Sep 12, 2024, 08:11 PM
ఆంక్షలు లేకుండా గణేష్ విగ్రహాల నిమజ్జనానికి అనుమతించాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది Thu, Sep 12, 2024, 05:13 PM
విద్యార్థినిల్లో రక్త హీనత తగ్గించుటకు ప్రభుత్వ కృషి Thu, Sep 12, 2024, 04:45 PM
రీడింగ్ గ్లాసెస్ అవసరం లేదన్న ప్రెస్వూ ఐ డ్రాప్స్‌‌కు ప్రభుత్వం ఆమోదం లేదు Thu, Sep 12, 2024, 04:44 PM
కామారెడ్డిలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం Thu, Sep 12, 2024, 04:43 PM