byసూర్య | Mon, Aug 12, 2024, 09:16 PM
చీకటి పడ్డాక క్లాస్ రూమ్ లోనే ఆపసోపాలు పడి నిద్రించడం. ఇదే కాదు, వారి పాఠశాలల్లోని టాయిలెట్స్ కు తలుపులు కూడా ఉండవు.. ఇంకా మరెన్నో సమస్యలు..జగిత్యాల - రాయికల్ మండలం అల్లీపూర్ బాలుర బీసీ గురుకుల పాఠశాలలో 5 వ తరగతి నుంచి 10 వ తరగతి వరకు మొత్తం 380 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. పాఠశాలలో మొత్తం 12 గదులుంటే.. అందులో సగానికి పైగా గదులు రేకుల షెడ్లతో నిర్మించారు. అయితే ఆ రేకులు ప్రస్తుతం పూర్తిగా పగిలిపోయి ఉన్నాయి.. అయితే వానొస్తే మాత్రం క్లాస్ రూములు, డార్మెటరీ గదులు వాన నీటిలో తడిసి చిత్తడిగా మారుతున్నాయి. దీంతో విద్యార్థులు తడిసి ముద్దవుతున్నారు. చలికి వణుకుతున్నారు. దీనికి తోడు రూముల్లో బెంచీల కరువుతో కటిక నేలపైనే విద్యార్థులు చదువుతున్నారు.. రాత్రికి అదే నేలపైన పడుకోవాల్సిన దుస్థితి నెలకొంది.పాఠశాలలో టాయిలెట్స్ ఉంటే.. వాటికి డోర్లు లేనే లేవు.. దీంతో విద్యార్థులు మలమూత్ర విసర్జనకు ఆరు బయటకు వెళ్లాల్సి వస్తుంది. పాఠశాల చుట్టూ కనీసం ప్రహరి గోడ కూడా లేదుదీంతో పాఠశాలకు కావలసినవి సమకూర్చి సమస్యలను వెంటనే పరిష్కరించాలని విద్యార్థులు చెబుతున్నారు.