'కవితకు వారం రోజుల్లో బెయిల్'..కేటీఆర్ జోస్యం

byసూర్య | Fri, Aug 09, 2024, 09:49 PM

 ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టయి జ్యుడీషియల్ ఖైదీగా ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ఎట్టకేలకు బెయిల్ దొరికింది. సుమారు 17 నెలల తర్వాత.. మనీష్ సిసోడియాకు బెయిల్ దొరికిన నేపథ్యంలో.. ఇదే కేసులో అరెస్టయి 4 నెలలకు పైగా జైలులోనే ఉంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎప్పుడు బెయిల్ వస్తుందన్నది చర్చ జరుగోతంది. ఈ క్రమంలోనే.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కవిత అన్న కేటీఆర్.. కీలక వ్యాఖ్యలు చేశారు. కవితకు వారం రోజుల్లో బెయిల్ వచ్చే అవకాశముందంటూ.. కీలక వ్యాఖ్యలు చేశారు.


జైలులో కవిత చాలా ఇబ్బందులు పడుతున్నారని కేటీఆర్ చెప్పుకొచ్చారు. కవిత ఇప్పటి వరకు 11 కిలోల బరువు తగ్గిందని పేర్కొన్నారు. బీపీతో బాధపడుతుందని.. జైలు పరిశుభ్రంగా లేదని, 11 వేలమంది ఖైదీలు ఉండాల్సిన జైలులో 30 వేలమంది ఖైదీల వరకు ఉన్నారంటూ.. కవిత జైలు జీవితం గురించి కేటీఆర్ వివరించారు.


ప్రజల కోసం కొట్లాడేవారిపైన ఇటువంటి కేసులు తప్పవని.. బెయిల్ కోసం మరోసారి అప్పీల్ చేశామని కేటీఆర్ తెలిపారు. ఇప్పటికే.. మనీష్ సిసోడియాకి బెయిల్ వచ్చిన నేపథ్యంలో.. కవితకు కూడా బెయిల్ వచ్చే అవకాశముందంటూ కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు.. కవితను జైలు నుంచి బయటికి తీసుకొచ్చేందుకు కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీలో చాలా ప్రయత్నాలు చేశారు. తీహార్ జైలులో జ్యుడీషియల్ ఖైదీగా ఉన్న కవితను కలిశారు.


 మరోవైపు.. కవితపై దాఖలైన ఛార్జిషీట్‌పై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేస్తూ.. నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కల్వకుంట్ల కవితతో పాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సహా పలువురును నిందితులుగా పేర్కొంటూ సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది. దీనిపై విచారణ ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడుతూ వస్తోంది. ఇందులో భాగంగానే.. రౌస్ ఎవెన్యూ కోర్టులో విచారణలో భాగంగా.. నిందితుల తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తూ.. సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను స్క్రూటినీ చేయాల్సి ఉంటుందని కోర్టుకు తెలిపారు.


మరోవైపు... ఛార్జిషీట్‌లోని పేపర్లకు ఒకవైపు మాత్రమే పేజ్ నెంబర్ ఉందని.. వాదనలు వినిపించేందుకు ఇబ్బందికరంగా ఉంటుందని కోర్టుకు వివరించారు. దీనిపై సీబీఐ ఈ నెల 14 వరకు పేజీనేషన్ సరి చేసి ఇస్తామని.. అప్పటివరకు సమయం ఇవ్వాలని కోర్టుకు వాదనలు వినిపించింది. దీంతో ఛార్జిషీట్‌పై తదుపరి విచారణను ఆగస్టు 21 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు కోర్టు వాయిదా వేసింది.


Latest News
 

బాలికపై హత్యాచారం చేసిన నిందితుడికి ఉరిశిక్ష విధించిన సంగారెడ్డి జిల్లా కోర్టు Thu, Sep 12, 2024, 08:11 PM
ఆంక్షలు లేకుండా గణేష్ విగ్రహాల నిమజ్జనానికి అనుమతించాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది Thu, Sep 12, 2024, 05:13 PM
విద్యార్థినిల్లో రక్త హీనత తగ్గించుటకు ప్రభుత్వ కృషి Thu, Sep 12, 2024, 04:45 PM
రీడింగ్ గ్లాసెస్ అవసరం లేదన్న ప్రెస్వూ ఐ డ్రాప్స్‌‌కు ప్రభుత్వం ఆమోదం లేదు Thu, Sep 12, 2024, 04:44 PM
కామారెడ్డిలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం Thu, Sep 12, 2024, 04:43 PM