తెలంగాణలో కొత్త రేషన్, హెల్త్‌కార్డులు,,,,త్వరలోనే విధివిధానాలు

byసూర్య | Fri, Aug 09, 2024, 09:44 PM

తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు, ఆరోగ్య శ్రీ హెల్త్ కార్డుల జారీ కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జారీ ప్రక్రియ, నియమ నిబంధనల కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ కేబినెట్ సబ్ కమిటీకి తెలంగాణ సివిల్ సప్లయ్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. రెవెన్యూ శాఖ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహలను సబ్ కమిటీ సభ్యులుగా నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం (ఆగస్టు 8) ఉత్తర్వులు జారీ చేసింది.


కాగా, కొత్త రేషన్, హెల్త్‌ కార్డులను వేర్వేరుగా ఇస్తామని రేవంత్ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. వీటికి ఎవరిని అర్హులుగా ఎంపిక చేయాలన్న విషయంపై సబ్ కమిటీ ఏర్పాటు చేస్తామని ఇటీవల అసెంబ్లీ సీఎం రేవంత్ ప్రకటించారు. అందులో భాగంగా తాజాగా.. మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయగా.. ఆ కమిటీ సభ్యులు అధ్యయనం చేసి విధివిధానాల్ని సిఫార్సు చేయనున్నారు.


ఇక కొత్త రేషన్ కార్డుల కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒకటి, రెండు సార్లు మినహా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయలేదు. దీంతో చాలా మంది కుటుంబాల నుంచి వేరు పడిన వారు, కొత్తగా పెళ్లిళ్లు చేసుకున్నవారు రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ప్రభుత్వం అందించే ఆరు గ్యారంటీలతో సహా.. అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ స్కీంలకు రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. దీంతో రేషన్ కార్డులు లేని వారు ఆందోళనకు గురవుతున్నారు.


ప్రస్తుతం తెలంగాణలో 89 లక్షల పై చిలుకు రేషన్ కార్డులు ఉన్నాయి. తాజాగా.. అర్హులు మరో 20-30 లక్షల కుటుంబాలు ఉంటాయని ప్రభుత్వ పెద్దలు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో రేషన్ కార్డులను అర్హులనే ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పటికే ప్రజా పాలన ద్వారా అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించగా.. విధి విధానాలు ఖరారు అయిన తర్వాత కార్డులు మంజూరు చేయనున్నారు. ఇక ఆరోగ్యశ్రీ పరిమితిని రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచిన విషయం తెలిసిందే. ఆరోగ్యశ్రీ కార్డుకు రేషన్ కార్డు లింక్ అసరం లేదని ఇదివరకే ప్రభుత్వం స్పష్టం చేసింది.


Latest News
 

బాలికపై హత్యాచారం చేసిన నిందితుడికి ఉరిశిక్ష విధించిన సంగారెడ్డి జిల్లా కోర్టు Thu, Sep 12, 2024, 08:11 PM
ఆంక్షలు లేకుండా గణేష్ విగ్రహాల నిమజ్జనానికి అనుమతించాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది Thu, Sep 12, 2024, 05:13 PM
విద్యార్థినిల్లో రక్త హీనత తగ్గించుటకు ప్రభుత్వ కృషి Thu, Sep 12, 2024, 04:45 PM
రీడింగ్ గ్లాసెస్ అవసరం లేదన్న ప్రెస్వూ ఐ డ్రాప్స్‌‌కు ప్రభుత్వం ఆమోదం లేదు Thu, Sep 12, 2024, 04:44 PM
కామారెడ్డిలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం Thu, Sep 12, 2024, 04:43 PM