తెలంగాణ రాష్ట్రం “ది ఫ్యూచర్ స్టేట్” కు పర్యాయపదంగా మారుతుంది

byసూర్య | Fri, Aug 09, 2024, 08:55 PM

హైదరాబాద్ నగర స్వరూప స్వభావాలను మార్చబోయే ఏఐ సిటీ, స్కిల్ యూనివర్సిటీ, నెట్ జీరో సిటీ లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో తెలంగాణ రాష్ట్రం “ది ఫ్యూచర్ స్టేట్” కు పర్యాయపదంగా మారుతుందని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి చెప్పారు. ఇలాంటి సందర్భంలో సెమి కండక్టర్ కంపెనీల పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఇండియన్ కాన్సులేట్ జనరల్ @CGISFO, యూఎస్ - ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్‌ ఫోరం @USISPForum సంయుక్తంగా ఏర్పాటు చేసిన సెమీకండక్టర్ రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. తెలంగాణలో చేపడుతున్న కొత్త ప్రాజెక్టులను వివరిస్తూ, “మీ భవిష్యత్తును ఆవిష్కరించుకోండి. అందరం కలిసికట్టుగా సరికొత్త భవిష్యత్తును తీర్చిదిద్దుకుందాం” అని పిలుపునిచ్చారు.‘ఇప్పటివరకు మేము న్యూయార్క్, న్యూజెర్సీ, వాషింగ్టన్ డీసీ, టెక్సాస్‌లో పర్యటించాం. ఇప్పుడు కాలిఫోర్నియాలో ఉన్నాం. అమెరికాలో ప్రతి రాష్ట్రానికి ఒక ప్రత్యేకత ఉంది. అవుటాఫ్ మెనీ.. వన్ అనేది న్యూయార్క్ స్టేట్ నినాదం. టెక్సాస్‌ను లోన్ స్టార్ స్టేట్ అని పిలుస్తారు.


 


కాలిఫోర్నియాకు యురేకా అనే నినాదం ఉంది. దేశంలో రాష్టాలకు ఇటువంటి ప్రత్యేక నినాదాలేమీ లేవు. ఇకనుంచి తెలంగాణ రాష్ట్రానికి అటువంటి ఒక లక్ష్య నినాదాన్ని ట్యాగ్ లైన్‌గా పెట్టుకుందాం. ఇకపై తెలంగాణ రాష్ట్రానికి ఒక లక్ష్యాన్ని నిర్ధేశిస్తున్నాం. తెలంగాణ “ఫ్యూచర్ స్టేట్” గా పిలుద్దాం..’ అని సీఎం ప్రకటిం


చారు. 


Latest News
 

కుమారి ఆంటీ గొప్ప మనసు.... సీఎం రేవంత్‌ రెడ్డి ఫిదా Wed, Sep 18, 2024, 07:49 PM
ఆ విషయంలో చైనా తర్వాత తెలంగాణనే బెస్ట్: సీఎం రేవంత్ రెడ్డి Wed, Sep 18, 2024, 07:46 PM
కుమార్తెను స్కూల్‌లో దింపి వస్తూ.. తల్లి దుర్మరణం Wed, Sep 18, 2024, 07:42 PM
గర్భాన్ని కాలితో తొక్కి డెలివరీ చేసిన నర్సులు,,పుట్టిన కాసేపటికే ప్రాణం వదిలిన శిశువు Wed, Sep 18, 2024, 07:38 PM
తెలంగాణను కేసీఆర్ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపారని కేటీఆర్ వెల్లడి Wed, Sep 18, 2024, 07:08 PM