byసూర్య | Fri, Aug 09, 2024, 07:38 PM
హైదరాబాద్‌లో రోజు రోజుకు ఇండ్లు కొనుక్కునేందుకు ప్రజలు అమితాసక్తి చూపిస్తున్నారు. అందుకు నిదర్శనమే.. గణనీయంగా పెరిగిన ఇండ్ల అమ్మకాలు కొనుగోళ్ల సంఖ్య. మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌ను ఆధారంగా చేసుకుని.. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్లు కొత్త కొత్త వెంచర్లు, గేటెడ్ కమ్యునిటీలు, పెద్ద పెద్ద టవర్లు ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలోనే.. నిర్మాణ రంగంలో బాహుబలిగా పేరు తెచ్చుకున్న మైహోమ్ సంస్థ.. హైదరాబాద్‌లో మరో అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీకి శ్రీకారం చుట్టింది.
మై హోమ్ అక్రిద.. పేరుతో నగరంలో టాలెస్ట్ టవర్‌ను నిర్మించబోతోంది. గచ్చిబౌలి విప్రో సర్కిల్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్టులకు చేరువలోని గోపనపల్లిలో.. సుమారు 24.99 ఎకరాల్లో మైహోమ్ అక్రిదాను నిర్మిస్తోంది. 81 శాతం ఓపెన్ ఏరియాతో.. పచ్చదనానికి పెద్దపీట వేస్తూ ఈ టవర్‌ను డిజైన్ చేశారు. ఇందులో మెుత్తం 12 హైరైజ్ టవర్స్ నిర్మించనున్నారు. ఈ 12 హైరైజ్ టవర్లు దేనికవే సాటిగా నిలువనున్నాయి. అంతేకాకుండా.. ఈ టవర్స్‌ను G ప్లస్ 39 అంతస్తులతో.. మొత్తం 3 వేల 780 ప్రీమియం ఫ్లాట్లు నిర్మించేలా ప్లాన్ చేస్తున్నారు.
ఈ ప్రాజెక్ట్‌లో 2 బీహెచ్ కే, 2.5తో పాటు 3 బీహెచ్ కే ఫ్లాట్లు అందుబాటులో ఉండనున్నాయి. 2 బీహెచ్ కే ఫ్లాట్లను 13 వందల 99 ఎస్‌ఎఫ్‌టీల్లో.. 2.5 బీహెచ్‌కేను 16 వందల 22 ఎస్‌ఎఫ్‌టీల్లో నిర్మిస్తున్నారు. ఇక 3 బీహెచ్ కే ఫ్లాట్స్‌ను 1926, 2012, 2262, 2347 ఎస్‌ఎఫ్‌టీల్లో.. మొత్తం 4 విస్తీర్ణాల్లో డెవలప్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో ప్రాపర్టీలన్నీ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్‌తో ఉండనున్నాయి.
సౌకర్యాల విషయానికి వస్తే.. ప్రతి టవర్‌లో డబుల్ హైట్ ఎంట్రన్స్ లాబీ ఉంటుంది. నివసించే వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా 4 బేస్‌మెంట్లలో కార్ పార్కింగ్ సదుపాయాన్ని కల్పిస్తున్నారు. బ్యూటీఫుల్ క్రాఫ్టెడ్ ల్యాండ్‌స్కేప్ హైలైట్‌గా ఉండబోతున్నాయి. ఈ ప్రాజెక్టులో రెండు క్లబ్ హౌస్‌లను నిర్మించనుండగా.. మొదటి క్లబ్ హౌస్ G ప్లస్ 4 అంతస్తులతో 58 వేల ఎస్‌ఎఫ్‌టీలో డెవలప్ చేయనున్నారు. రెండో క్లబ్ హౌస్‌ను G ప్లస్ మూడు అంతస్తుల్లో 47 వేల ఎస్‌ఎఫ్‌టీలో అభివృద్ధి చేయనున్నారు.
అవుట్‌డోర్ జిమ్, టెన్నిస్ కోర్టులు, బాస్కెట్‌బాల్ కోర్టు, బాక్స్ క్రికెట్, క్రికెట్ ప్రాక్టీస్ నెట్స్, జిమ్స్, స్విమ్మింగ్ పూల్, కిడ్స్ ప్లే ఏరియా, సీటింగ్ జోన్, యాంపి థియేటర్, జాగింగ్ అండ్ వాకింగ్ ట్రాక్, పెట్ జోన్, లాన్స్, స్కైవాక్, స్కేటింగ్ రింగ్, సైక్లింగ్ ట్రాక్, గ్రాండ్ లాబీ, మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్స్ ఉంటాయి. మరోవైపు యోగా.. మెడిటేషన్.. ఏరోబిక్ హాల్స్, గెస్ట్ రూమ్స్, రీడింగ్ ఏరియా, ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్టులు ఏర్పాటు చేయనున్నారు. ఇండోర్ గేమ్స్, స్క్వాష్ కోర్టులు, కన్వీనియన్స్ స్టోర్, ఏటీఎం, బ్యాంక్, ఎస్ అండ్ బీ, ఫార్మసీ, స్పా అండ్ సెలూన్, గ్యాస్ బ్యాంక్స్, ట్రాన్స్‌ఫార్మర్స్ యార్డ్‌తో ఇతర సౌకర్యాలను సంస్థ అందిస్తోంది.
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు, ఓల్డ్ ముంబై హైవేకు కూతవేటు దూరంలోనే ఈ కొత్త ప్రాజెక్ట్ డెవలప్ అవుతోంది. ఈ ప్రాజెక్ట్ నుంచి 10 నిమిషాల్లోనే సమీపంలోని రైల్వే స్టేషన్‌కు చేరుకునే అవకాశం ఉంది. అలాగే ఫైనాన్షియల్ డిస్ట్రిక్, టాప్ హాస్పిటల్స్, మాల్స్, ఔటర్ రింగ్‌రోడ్డుకు తక్కువ సమయంలోనే చేరుకోవచ్చు. 35 నిమిషాల్లో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈ ప్రాజెక్ట్ నుంచి వెళ్లొచ్చు. అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలు కూడా కూతవేటటు దూరంలోనే ఉన్నాయి.
ఆగస్టు 11 నుంచి ఫ్లాట్ల బుకింగ్ ప్రారంభం కానుంది. ప్రాపర్టీ విలువలో 10శాతం డబ్బును చెల్లించగానే కార్ పార్కింగ్ ప్లేస్‌ను అలాట్ చేస్తారు. మై హోమ్ అక్రిదాలో ప్రాపర్టీని బుక్ చేసుకోవాలంటే అడ్వాన్స్ పేమెంట్ కింద రెండున్నర లక్షల రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది. బుకింగ్ చేసుకున్న 30 రోజుల్లోగా అడ్వాన్స్‌తో కలిపి ప్రాపర్టీ విలువలో 10 శాతం డబ్బును చెల్లించాల్సి ఉంటుంది.