తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు,,,,పలు జిల్లాలలకు ఎల్లో అలర్ట్

byసూర్య | Tue, Aug 06, 2024, 10:56 PM

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రానున్న 3 రోజులపాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మంగళవారం (ఆగస్టు 06) నుంచి బుధవారం (ఆగస్టు 07) వరకు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, రంగారెడ్డి, నాగర్‌ కర్నూల్‌ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం అధికాలు అంచనా వేశారు. వీటితో పాటు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని సూచించారు.


ఇక బుధవారం నుంచి గురువారం వరకు ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, వరంగల్‌, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. నిజామాబాద్‌, కామారెడ్డి, నిర్మల్‌, జగిత్యాల, కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, ములుగు, భూపాలపల్లి, ఖమ్మం, కొత్తగూడెం, సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్‌, సిద్దిపేట, జనగాం, హైదరాబాద్‌, రంగారెడ్డి, మల్కాజ్‌గిరి, మేడ్చల్‌, వికారాబాద్‌, మెదక్‌, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని సూచించారు.


ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. ఆయా జిల్లాల్లోని ప్రజలు కొంచెం జాగ్రత్తగా ఉండాలని సూచించింది. హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని.. పలుచోట్ల మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని సూచించింది. ఇదిలా ఉంటే.. గడిచిన 24 గంటల్లో నిజామాబాద్‌, మెదక్‌, వనపర్తి, నల్గొండ, సిద్దిపేట, వరంగల్‌, మహబూబాబాద్‌, కొత్తగూడెంతో పాటు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా ఖమ్మం జిల్లా కొణిజెర్లలో 148 మిల్లీమీటర్లు, తల్లాడలో 120 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైనట్టు అధికారులు తెలిపారు.


Latest News
 

బాలికపై హత్యాచారం చేసిన నిందితుడికి ఉరిశిక్ష విధించిన సంగారెడ్డి జిల్లా కోర్టు Thu, Sep 12, 2024, 08:11 PM
ఆంక్షలు లేకుండా గణేష్ విగ్రహాల నిమజ్జనానికి అనుమతించాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది Thu, Sep 12, 2024, 05:13 PM
విద్యార్థినిల్లో రక్త హీనత తగ్గించుటకు ప్రభుత్వ కృషి Thu, Sep 12, 2024, 04:45 PM
రీడింగ్ గ్లాసెస్ అవసరం లేదన్న ప్రెస్వూ ఐ డ్రాప్స్‌‌కు ప్రభుత్వం ఆమోదం లేదు Thu, Sep 12, 2024, 04:44 PM
కామారెడ్డిలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం Thu, Sep 12, 2024, 04:43 PM