ఇక నుంచి కొండపైనే, పదేళ్ల తర్వాత మళ్లీ ఆ అదృష్టం..!

byసూర్య | Tue, Aug 06, 2024, 10:49 PM

యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి భక్తులకు పదేళ్ల తర్వాత మళ్లీ.. కొండపైన ఉన్న విష్ణు పుష్కరిణిలో సంకల్ప స్నానాలు చేసే అవకాశం కల్పించానున్నారు. ఇందుకోసం విష్ణు పుష్కరిణిని శుభ్రం చేసి.. స్నానాలకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఆగస్టు 11వ తేదీ స్వాతినక్షత్రం రోజున ఉదయం 9.30 గంటలకు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు.. ఆలయ ఈవో భాస్కర రావు విష్ణు పుష్కరిణిని అధికారులతో కలిసి పరిశీలించారు. అయితే పదేళ్ల కిందట.. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునే భక్తులు కొండపై గల పుష్కరిణిలోనే స్నానాలు ఆచరించి.. దర్శనాలు చేసుకునేవారు.


యాదాద్రి ఆలయ పునర్‌ నిర్మాణంలో భాగంగా.. కొండపైన పుష్కరిణిలో స్నానాలు చేయటాన్ని ఆపేశారు. కొండ కింద లక్ష్మీ పుష్కరిణిలో మాత్రమే స్నానాలు ఆచరించేందుకు ఏర్పాట్లు చేశారు. అప్పటి నుంచి భక్తులు కొండ కిందే స్నానాలు చేసి.. పైకి వెళ్లి దర్శనాలు చేసుకుంటున్నారు. ఈ పద్ధతితో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన అధికారులు.. ఇకపై గతంలో మాదిరి భక్తులకు కొండపై పుష్కరిణిలో సంకల్ప స్నానాలను పునఃప్రారంభించాలని సంకల్పించారు.


అయితే.. ఈ స్నాన సంకల్పాలను ఉచితంగా కాకుండా రూ.500 రుసుంగా నిర్ణయించారు. కాగా.. ఈ టికెట్ తీసుకున్నవారికి.. స్వామివారి ప్రత్యేక దర్శన సదుపాయం, ఉచితంగా స్వామివారి లడ్డూ అందజేయనున్నారు. టికెట్ లేని భక్తులకు పుష్కరిణిలో నీటిని తలపై చల్లుకునేందుకు మాత్రమే అనుమతిస్తామని అధికారులు పేర్కొన్నారు.


15 ఏళ్ల తర్వాత యాదాద్రిలో బదిలీలు


ఇదిలా ఉంటే.. యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సుమారు 15 ఏళ్ల తర్వాత ఉద్యోగుల బదిలీలు జరిగాయి. ఆలయంలో 26 మంది ఉద్యోగులు రాష్ట్రంలోని ఇతర ఆలయాలకు బదిలీ అయ్యారు. బదిలీ అయిన వారిలో ఇద్దరు ఏఈవోలు, ఆరుగురు సూపరింటెండెంట్లు, ఏడుగురు సీనియర్ అసిస్టెంట్లు, తొమ్మిది మంది జూనియర్ అసిస్టెంట్లు, ఒక సివిల్ ఇంజినీర్ డీఈ, ఒక ఎలక్ట్రికల్ ఏఈ ఉన్నారు. ‌


యాదాద్రిలో చివరిసారిగా 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే బదిలీలు జరిగాయి. అప్పటినుంచి యాదాద్రి ఆలయంలో ఇప్పటివరకు బదిలీలు జరగలేదు. చాలా మంది అధికారులకు, పలు విభాగాల్లో పనిచేసే ఉద్యోగులకు పదోన్నతులు లభించి యాదగిరిగుట్టలోనే ఉద్యోగాలు చేస్తున్నారు. దాదాపుగా 15 ఏళ్ల తర్వాత.. తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారిగా బదిలీలు జరగటం గమనార్హం.


Latest News
 

టీవీ చూద్దామని పిలిచి,,,,చిన్నారిని కాటేసిన పక్కింటి కుర్రాడు Wed, Sep 18, 2024, 08:19 PM
మత సామరస్యానికి ప్రతీక,,,గణేష్ లడ్డూ దక్కించుకున్న ముస్లిం దంపతులు Wed, Sep 18, 2024, 08:18 PM
ఈ విషాదం ఎవ‌రి పాపం?: కేటీఆర్ Wed, Sep 18, 2024, 08:16 PM
బీఆర్ఎస్‌కు హైకోర్టులో చుక్కెదురు.. పార్టీ ఆఫీస్ కూల్చేయాలని ఆదేశం Wed, Sep 18, 2024, 08:14 PM
ఆసక్తికర సన్నివేశం.. ఒకే వేదికపై రేవంత్ రెడ్డి, కేటీఆర్ Wed, Sep 18, 2024, 08:12 PM