హైదరాబాద్‌కు క్యూ కడుతున్న కంపెనీలు.. ట్రైజిన్ ఏఐ ఇన్నోవేషన్ సెంటర్‌

byసూర్య | Tue, Aug 06, 2024, 10:44 PM

తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి బృందం.. ప్రముఖ కంపెనీలతో నిర్వహిస్తున్న సమావేశాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. రెండు దశాబ్దాలకు పైగా ఐక్యరాజ్య సమితితో పాటు అనుబంధ విభాగాలకు సాంకేతిక భాగస్వామిగా వ్యవహరిస్తోన్న ట్రైజిన్ టెక్నాలజీస్ కంపెనీ హైదరాబాద్‌లో తమ అర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సెంటర్ నెలకొల్పనుంది. ట్రైజిన్ కంపెనీ ప్రతినిధులతో రేవంత్ రెడ్డి బృందం ప్రత్యేకంగా సమావేశమై చర్చలు జరిపారు. ఈ సమావేశం ఫలితంగా.. హైదరాబాద్‌లో ట్రైజిన్ కంపెనీ అర్టిఫిషియల్ ఇంటెలెజెన్స్ ఇన్నోవేషన్ అండ్ డెలివరీ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. రాబోయే మూడేండ్లలో 1,000 మందికి పైగా ఉద్యోగులను నియమించుకొని శిక్షణను అందించనున్నట్టు ప్రకటింటింది. ట్రైజిన్ కంపెనీ డేటా అనలిటిక్స్, అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్‌లకు అవసరమయ్యే ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్ అందిస్తుంది.


ట్రైజిన్ కంపెనీ మొత్తం ఆదాయం 160 మిలియన్ డాలర్లకు పైగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ కంపెనీలో పని చేస్తున్న 2,500 మందిలో వెయ్యి మంది మన దేశంలో ఉండగా.. ప్రస్తుతం హైదరాబాద్‌లో దాదాపు వంద మంది ఉన్నారు. మరో ఆరు నెలల్లోనే తమ కార్యకలాపాలను ప్రారంభించనున్నట్లు ఈ కంపెనీ ప్రకటించింది. గత ఏడాది నుంచి ట్రైజిన్ కంపెనీ తమ సేవలను అందుకుంటున్న సంస్థల్లో అర్టిఫిషియల్ ఇంటెలెజెన్స్ వినియోగంతో పాటు ఫలితాలపై విశ్లేషణలు చేస్తోంది. అన్ని రంగాలలో అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా ఎంచుకుంది.


మరోవైపు అసెట్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ సర్వీసెస్, అడ్వాన్స్‌డ్ డేటా ఆపరేషన్స్‌లో ప్రముఖ కంపెనీ ఆర్సీజియం (Arcesium) హైదరాబాద్‌లోని తమ కంపెనీని విస్తరించడానికి అంగీకరించింది. ఆర్సీజియం సీఈఓ గౌరవ్ సూరి ఇతర ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి.. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర అధికారుల బృందం జరిపిన చర్చల్లో ఈ మేరకు ఒప్పందం కుదిరింది.


ఆర్సీజియం అంతర్జాతీయంగా బయటి దేశాల్లో మొదటి శాఖను హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేసింది. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి అందిస్తున్న సహకారంతో తమ సేవలను మరింతగా విస్తరిస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. అంతర్జాతీయ స్థాయిలో కావలసిన సదుపాయాలకు అనుగుణంగా హైదరాబాద్‌లోని గొప్ప టాలెంట్ ఫోర్స్, సహజ రీతిలో ఉండే లొకేషన్, నైపుణ్యం కలిగిన స్థానిక ఉద్యోగుల లభ్యత కారణంగా అంకితభావంతో హైదరాబాద్‌లో డాటా సొల్యూషన్ సర్వీసులను అభివృద్ధి పరుస్తున్నామని గౌరవ్ సూరి తెలిపారు.


వచ్చే రెండేళ్లలో హైదరాబాద్‌లో 500 మంది అత్యాధునిక సాంకేతిక నిపుణులను కంపెనీ నియమించుకోనుంది. డీఈ షా గ్రూప్, బ్లాక్‌స్టోన్ ఆల్టర్నేటివ్ అసెట్ మేనేజ్‌మెంట్ మద్దతుతో ఆర్సీజియం స్వతంత్ర సంస్థగా ప్రారంభమైంది. ఆర్సీజియం తన సేవలను విస్తరణ చేపడుతున్నందుకు ముఖ్యమంత్రి కంపెనీ ప్రతినిధులను అభినందించారు. కంపెనీకి తమ పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. తెలంగాణలో ఐటీ అభివృద్ధికి అంకితభావంతో కృషి చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు.



Latest News
 

బీఆర్ఎస్ కుట్రలు నమ్మవద్దన్న దామోదర రాజనర్సింహ Wed, Sep 18, 2024, 08:50 PM
టీవీ చూద్దామని పిలిచి,,,,చిన్నారిని కాటేసిన పక్కింటి కుర్రాడు Wed, Sep 18, 2024, 08:19 PM
మత సామరస్యానికి ప్రతీక,,,గణేష్ లడ్డూ దక్కించుకున్న ముస్లిం దంపతులు Wed, Sep 18, 2024, 08:18 PM
ఈ విషాదం ఎవ‌రి పాపం?: కేటీఆర్ Wed, Sep 18, 2024, 08:16 PM
బీఆర్ఎస్‌కు హైకోర్టులో చుక్కెదురు.. పార్టీ ఆఫీస్ కూల్చేయాలని ఆదేశం Wed, Sep 18, 2024, 08:14 PM