byసూర్య | Tue, Aug 06, 2024, 10:18 PM
జీవితంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా, లక్ష్యాన్ని సాధించాలన్న సంకల్ప బలం మనలో ఉండటం ప్రధానమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రిగారు న్యూయార్క్ నగరంలో భారత అంధుల క్రికెట్ జట్టు క్రీడాకారులను కలుసుకున్నారు. వారిని కలుసుకున్న సందర్భం తనకు లభించిన ఒక అమూల్యమైన అవకాశంగా భావిస్తున్నానని ముఖ్యమంత్రి గారు అన్నారు. వారితో ఆప్యాయంగా కొద్దిసేపు ముచ్చటించారు. జీవితంలో ఎలాంటి సవాళ్లయినా ఎదుర్కొనే మానసిక స్థైర్యాన్ని వారి నుంచి నేర్చుకోగలమన్నారు. వారిలోని స్పూర్తిని అభినందిస్తూ వారికి ముఖ్యమంత్రి గారు శుభాకాంక్షలు తెలియజేశారు.