byసూర్య | Tue, Aug 06, 2024, 03:30 PM
1934 ఆగష్టు 6న వరంగల్‌లోని లోని అక్కంపేట గ్రామంలో కొత్తపల్లి జయశంకర్ సార్ జన్మించారు. ఓయూ నుండి ఆర్థిక శాస్త్రంలో పిహెచ్.డి పట్టా పొందారు. ఉపాధ్యాయుడిగా, అధ్యాపకుడిగా, ప్రొఫెసర్‌గా ఇలా ఎన్నో బాధ్యతలు నిర్వహించారు. విద్యార్థులకు అందమైన భవిష్యత్తుని ఇవ్వడమే కాకుండా ప్రత్యేక తెలంగాణ నిర్మాణమే రాష్ట్ర ప్రజల గొంతుక అయ్యేలా చేసి తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్తగా పేరొందారు. తెలంగాణ స్వరాష్ట్ర కలకు దిక్సూచిగా నిలిచారు.