byసూర్య | Tue, Aug 06, 2024, 03:23 PM
తెలంగాణ స్వరాష్ట్ర సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధనకై ఆయన చేసిన కృషిని, త్యాగాన్ని భారాస అధినేత కేసీఆర్ స్మరించుకున్నారు. వారి అడుగుజాడల్లో తాను మలిదశ తెలంగాణ ఉద్యమానికి సారథ్యం వహించి, చివరి దాకా శాంతియుత పద్ధతిలో ప్రజా ఉద్యమాన్ని కొనసాగించి, అరవై ఏళ్ల స్వయంపాలన ఆకాంక్షను నిజం చేసుకున్నామని కేసీఆర్ అన్నారు.