![]() |
![]() |
byసూర్య | Sun, Jul 14, 2024, 08:13 PM
వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపరాదని ట్రాఫిక్ కానిస్టేబుల్ దేవేందర్ అన్నారు. ఆదివారం నారాయణపేట పట్టణంలోని నర్సిరెడ్డి కూడలిలో వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించి వాహనాలు నడపాలని, రోడ్డుపై అడ్డంగా వాహనాలు పార్కింగ్ చేయరాదని అన్నారు. ట్రాఫిక్ సిగ్నల్ పాటించాలని చెప్పారు. సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదని అన్నారు. ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు.