అరుణాచలం గిరి ప్రదక్షిణకు వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్

byసూర్య | Sun, Jul 14, 2024, 08:06 PM

ప్రయాణికుల సౌకర్యార్థం తెలంగాణ ఆర్టీసీ అధికారులు కీలక చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే తెలంగాణ నుంచి వివిధ రాష్ట్రాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రాలకు సైతం బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చారు. తాజాగా.. తమిళనాడులోని అరుణాచలేశ్వరుడి గిరి ప్రదక్షిణ చేయాలనుకునే భక్తులకు టీజీఎస్ ఆర్టీసీ అధికారులు శుభవార్త చెప్పారు. గురు పౌర్ణమి సందర్భంగా భక్తుల సౌకర్యార్థం తెలంగాణలోని పలు జిల్లాల నుంచి అరుణాచలం టెంపుల్‌కు ప్రక్యేక బస్సులను నడపనున్నట్లు వెల్లడించించారు.


హైదరాబాద్‌ నగరంతో పాటు ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మెదక్‌, నల్లగొండ, వరంగల్‌, కరీంనగర్‌, కరీంనగర్‌, ఖమ్మం, మహబుబ్‌నగర్‌, తదితర ప్రాంతాల నుంచి ఈ ప్రత్యేక బస్సులను టీజీఎస్‌ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసింది. ఈ నెల 21న గురుపౌర్ణమి కాగా.. 19వ తేది నుంచి 22వ తేది వరకు ఈ ప్రత్యేక బస్సులను సంస్థ నడుపుతోంది. ఈ ప్యాకేజీలో కాణిపాక వరసిద్ది వినాయక స్వామితో పాటు శ్రీపురంలోని గొల్డెన్‌ టెంపుల్‌ను సందర్శించే సౌకర్యాన్ని కల్పించడం జరిగిందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. అరుణాచల గిరి ప్రదక్షిణ ప్యాకేజీ బుకింగ్‌ కోసం http://tsrtconline.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.


ఇక మహాలక్ష్మీ పథకంలో భాగంగా తెలంగాణలోని ఆర్టీసీ బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బస్సుల్లో కాలు పెట్టేందుకు కూడా జాగా లేకుండా ఉంది. ఈ నేపథ్యంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గుడ్‌న్యూస్ చెప్పారు. త్వరలో కొత్త బస్సులు తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే 1000 బస్సులు కొనుగోలు చేశామని చెప్పారు. తర్వలోనే మరో 1500 బస్సులకు తీసుకురానున్నట్లు చెప్పారు.


ప్రతి నియోజకవర్గం నుంచి జిల్లా కేంద్రాలకు లగ్జరీ బస్సు నడుపుతామని అన్నారు. ప్రయాణికుల సౌకర్యం కోసం అన్ని జిల్లాల నుంచి హైదరాబాద్ నగరానికి ఏసీ బస్సులు నడపనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. మంత్రి ప్రకటనతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం బస్సుల్లో రద్దీ విపరీతంగా ఉందని.. కొత్త బస్సుల రాకతో రద్దీ తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


Latest News
 

ఇక వర్షాలే..ఎండ తీవ్రత నుంచి ఉపశమనం Sun, Mar 16, 2025, 07:33 PM
తెలంగాణ యువతకు .. ఒక్కొక్కరికి రూ. 3 నుంచి 5 లక్షలు Sun, Mar 16, 2025, 06:12 PM
అర్ధరాత్రి వేళ ప్రవేశించిన ఆగంతకుడు..బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లో కలకలం Sun, Mar 16, 2025, 05:50 PM
మా ప్రభుత్వం వచ్చాకే.. వరంగల్‌కు ఎయిర్‌పోర్ట్, రింగ్‌రోడ్డు ... సీఎం రేవంత్‌రెడ్డి Sun, Mar 16, 2025, 05:47 PM
పీఎం ఆవాస్ యోజన పథకం.. వెబ్‌సైట్లో లబ్ధిదారుల లిస్ట్.. Sun, Mar 16, 2025, 05:43 PM