హయత్‌నగర్‌కు మెట్రో రైలు.. గుడ్ న్యూస్ వినిపించిన సీఎం రేవంత్ రెడ్డి

byసూర్య | Sun, Jul 14, 2024, 08:04 PM

హైదరాబాద్‌ వాసులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ వినిపించారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ లష్కర్‌గూడలో గౌడ కులస్థుల కోసం "కాటమయ్య రక్షణ కవచం" పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కల్లుగీత కార్మికులతో సరదాగా ముచ్చటించి.. వారి సాధకబాధకాలు తెలుసుకున్నారు. అనంతరం వారికి కిట్లు అందించి.. ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. మూడు కీలక ప్రకటనలు చేశారు.


హైదరాబాద్‌లో రీజనల్ రింగ్ రోడ్డు తో పాటు భవిష్యత్‌లో రేడియల్ రోడ్స్  అభివృద్ధి చేసుకోబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అలా జరిగితే.. రంగారెడ్డి జిల్లాలోని భూములు బంగారం అవుతాయని సీఎం చెప్పుకొచ్చారు. మరోవైపు.. హైదరాబాద్ మెట్రో పొడిగింపులో భాగంగా.. తొందర్లోనే హయత్‌నగర్‌కు మెట్రో రైలు రాబోతుందని తెలిపారు. ఇందుకు సంబంధించిన అన్ని ప్రణాళికలు ఇప్పిటికే సిద్ధమయ్యాయని రేవంత్ రెడ్డి వెల్లడించారు.


  రంగారెడ్డి జిల్లాకు త్వరలోనే మహర్దశ పట్టబోతుందని.. సైబరాబాద్ పేరుతో ఎలా అభివృద్ధి జరిగిందో అలాగే ఇక్కడ కూడా అభివృద్ధి చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. న్యూయార్క్‌ సిటీతో పోటీ పడేలా మహేశ్వరంలో కూడా కొత్త సిటీని నిర్మించబోతున్నట్టు రేవంత్ రెడ్డి ప్రకటించారు. శంషాబాద్‌లో మెడికల్ టూరిజం హబ్, రాచకొండ ప్రాంతంలో అద్భుతమైన ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. ఇప్పటికే అద్భుతంగా రామోజీ ఫిల్మ్ సిటీ ఉందని.. దాంట్లో దేశవ్యాప్తంగా ఉన్న సినిమావాళ్లు వచ్చి షూటింగులు జరుపుకుంటున్నారని.. ఇక అంతకంటే మిన్నగా మరో ఫిల్మ్ సిటీని ప్రభుత్వం నిర్మిస్తుందని వెల్లడించారు.


మరోవైపు.. సంచలనంగా మారిన నిరుద్యోగుల ఆందోళనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. నియామక పరీక్షలను కొంతమంది వాయిదా వేయాలని కోరితే.. మరికొందరు ముందుకు పోవాలని అంటున్నారని తెలిపారు. నిరుద్యోగుల బాధలను వినేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం స్పష్టం చేశారు. పరీక్షల వాయిదా కోసం రోడ్డెక్కే బదులు.. మంత్రులను కలిసి చర్చిస్తే వారి సమస్యలను పరిష్కరించే బాధ్యత తమది అని సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.



Latest News
 

సచివాలయంలో బీసీ సంఘాలు, బీసీ మేధావులతో మంత్రి పొన్నం సమావేశం Sat, Feb 08, 2025, 07:54 PM
కోటి కుంకుమార్చనను ప్రారంభించిన ఎమ్మెల్యే తలసాని Sat, Feb 08, 2025, 07:50 PM
భువనగిరి పట్టణంలో బీజేపీ నాయకులు సంబరాలు Sat, Feb 08, 2025, 07:48 PM
సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ Sat, Feb 08, 2025, 07:47 PM
కబడ్డీ పోటీలను ప్రారంభించిన మాజీ ఎంపీ Sat, Feb 08, 2025, 07:46 PM