నీ అక్రమాలు త్వరలోనే బయట పెడతా.. నువ్వు మొగోనివైతే ఆ పని చేయ్: పాడి కౌశిక్ రెడ్డి

byసూర్య | Sun, Jul 14, 2024, 07:52 PM

తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారు. కాగా.. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్.. బీఆర్ఎస్ పార్టీపై చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. త్వరలోనే బీఆర్ఎస్ఎల్పీ కాంగ్రెస్‌ పార్టీలో విలీనం అవుందని దానం వ్యాఖ్యానించగా.. ఆ కామెంట్లపై హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పందిస్తూ.. తీవ్ర స్థాయిలో విమర్శించారు. కేటీఆర్‌పై దానం నాగేందర్‌ చేసిన వ్యాఖ్యలను ఖండించిన కౌశిక్ రెడ్డి.. కేసీఆర్‌, కేటీఆర్‌లను విమర్శించే స్థాయి దానంకు లేదని చెప్పుకొచ్చారు. నిజంగా అంత రోషం ఉంటే కేసీఆర్, కేటీఆర్ భిక్ష వేసిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. మళ్లీ పోటీ చెయ్యాలని సవాల్ విసిరారు. దమ్ము ధైర్యం ఉంటే.. మొగోడివే అయితే వెంటనే రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేశారు.


కాంగ్రెస్‌ తనకు అన్యాయం చేసిందని.. కేసీఆర్‌ దయతోనే గెలిచానంటూ గతంలో దానం నాగేందర్‌ చెప్పిన మాటలను కౌశిక్ రెడ్డి గుర్తు చేశారు. ప్రజలను వేధించడంలో దానంను మించినోడు లేడంటూ ఆరోపించారు. త్వరలోనే దానం ఆక్రమణలు, అక్రమాలు బయటపెడతానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి గతంలో ఏమని తిట్టాడో ఓసారి గుర్తు చేసుకో అని సూచించారు. పంజాగుట్ట చౌరస్తాలో దానం నాగేందర్ బీడీలు అమ్ముకునే వాడని.. స్వయంగా రేవంత్ రెడ్డే విమర్శించాడని గుర్తు చేశారు. మరి.. బీడీలు అమ్ముకునే దానం నాగేందర్‌కు ఇన్ని వేల కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. దానం బాధితులు చాలా మంది తనను కలిసినట్టు చెప్పుకొచ్చారు.


దానం నాగేందర్‌తో పాటు పార్టీ వదిలిపెట్టిన ప్రతి ఎమ్మెల్యే రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని.. అప్పుడు ప్రజలే అసలైన తీర్పు ఇస్తారని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన బీఆర్‌ఎస్‌ పార్టీ పడిపోదని కౌశిక్‌రెడ్డి చెప్పుకొచ్చారు. కార్యకర్తలు అధైర్యపడొద్దని.. మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్‌ఎస్ పార్టీనేనని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు.. రేవంత్‌ రెడ్డి చెప్పిన ఆరు గ్యారంటీల్లో ఏదీ పూర్తిగా అమలు కాలేదని కౌశిక్ రెడ్డి తెలిపారు. ఏ రాష్ట్రంలో ఇవ్వనన్ని ఉద్యోగాలు కేసీఆర్‌ ఇచ్చారన్నారు. 2 లక్షల 32 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చారని తెలిపారు.



Latest News
 

కుత్బుల్లాపూర్‌లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ Wed, Jun 18, 2025, 02:12 PM
అమ్మాయి విషయంలో స్నేహితుల మధ్య గొడవ.. ఓ యువకుడు మృతి Wed, Jun 18, 2025, 02:09 PM
ఇందిరమ్మ ఇళ్లతో లక్షెట్టిపేటలో స్వప్న గృహాల నిర్మాణం Wed, Jun 18, 2025, 02:09 PM
అంగన్‌వాడీల సమర్థ నిర్వహణపై పెద్దపల్లి కలెక్టర్ ఆదేశాలు Wed, Jun 18, 2025, 02:06 PM
జగిత్యాల రూరల్ బీజేపీకి కొత్త జోష్.. శెట్టి రవీందర్ ఉపాధ్యక్షుడిగా నియమితులు Wed, Jun 18, 2025, 02:02 PM