![]() |
![]() |
byసూర్య | Sun, Jul 14, 2024, 07:26 PM
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని ఐదు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ శాఖ ఆదివారం ఉదయం ఎల్లో వార్నింగ్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో సోమవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై నీరు చేరవచ్చని, లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురి కావచ్చని నివేదికలో పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో పంటలు దెబ్బతినే అవకాశం ఉందని వివరించారు.