byసూర్య | Sun, Jul 14, 2024, 06:55 PM
త్రిపురారం మండలం కూన్యా గ్రామానికి చెందిన రమావత్ తులసి (60) అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న సామాజిక సేవా కర్త ఎస్ ఆర్ బ్రదర్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ధనావత్ రఘు నాయక్ వారి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. అనంతరం రూ.5000 ఆర్థిక సహాయంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో లచ్చు నాయక్, తావు నాయక్, క్రిష్ణ నాయక్, పకిర నాయక్, బి చ్చు నాయక్ తదితరులు పాల్గొన్నారు.