byసూర్య | Sun, Jul 14, 2024, 06:55 PM
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అధికారిక నివాసం హైద్రాబాద్ లోని ప్రజా భవన్ లో ఆదివారం నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నెత్తిన బోనం పెట్టుకొని ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు. వేడుకల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు పాల్గొన్నారు.