![]() |
![]() |
byసూర్య | Sun, Jul 14, 2024, 03:11 PM
జోగులాంబ గద్వాల జిల్లా ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డిని ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు మున్న బాష ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రం బీడీ కాలనీలోని షాదీఖానా స్థలాన్ని కొందరు వ్యక్తులు కబ్జా చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. స్పందించిన ఎమ్మెల్యే ప్రహారీ నిర్మిస్తామని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, ఎంఐఎం నాయకులు పాల్గొన్నారు.