తెలంగాణకు వర్ష సూచన.. 13 జిల్లాల్లో భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ

byసూర్య | Sat, Jul 13, 2024, 10:13 PM

తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణం కేంద్రం అధికారులు చల్లని కబురు చెప్పారు. నేటి నుంచి ఐదు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. నైరుతి రుతుపవనాలు బలపడటానికి తోడు.. అల్ప పీడన ప్రభావంతో రాష్ట్రంలో వానలు కురుస్తాయని చెప్పారు.జులై 18 వరకు ఈ వర్షాలు కొనసాగుతాయన్నారు. 13 జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నేడు ప్రధానంగా నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కామారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.


 ఈ 13 జిల్లాలు కాక మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. వర్షాలకు తోడు భారీ స్థాయిలో ఈదురు గాలులు వీస్తాయన్నారు. గంటకు 30-40 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయన్నారు. ఉరుములు, మెరుపులకు తోడు పలు జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్ ఉందని చెప్పారు. పొలం పనులకు వెళ్లేవారు చెట్ల కింద ఉండకూడని.. వర్షాలు కురిసే సమయంలో అవసరం అయితేనే బయటకు వెళ్లాలని సూచించారు. ఇక హైదరాబాద్‌లో ఉదయం వాతావరణం పొడిగా ఉంటుందని చెప్పారు. మేఘాలు కమ్ముకొని ఉంటాయని అయితే వర్షం కురిసే ఛాన్స్ తక్కువగా ఉంటుందన్నారు. సాయంత్రం లేదా రాత్రి సమయంలో హైదరాబాద్‌లో వర్షం కురిసే ఛాన్స్ ఉందన్నారు.


శుక్రవారం తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్ నగరంలోనూ పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. వర్షానికి నగరంలోని పలు ప్రాంతాల్లో రహదారులపై వర్షపు నీరు చేరింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రంగంలోకి దిగిన ట్రాఫిక్, జీహెచ్‌ఎంసీ అధికారులు వర్షపు నీరు డ్రైనేజీల్లోకి వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. ఇక జూన్ నెలలో ఆశించినంతగా వర్షాలు కురవలేదు. దీంతో అన్నదాతలు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. అయితే జులై నెలలో మాత్రం వర్షాలు దంచికొడతాయని ఐఎండీ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే జులై మాసంలో సగం రోజులు పూర్తి కాగా.. వచ్చే 15 రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని అన్నదాతలు ఆశగా ఎదురు చూస్తున్నారు.


Latest News
 

ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి Thu, Apr 17, 2025, 09:55 PM
సింగరేణి ఉద్యోగి కుటుంబానికి చెక్కుల పంపిణీ Thu, Apr 17, 2025, 09:52 PM
బెంగాల్ లో రాష్ట్రపతి పాలన విధించాలి Thu, Apr 17, 2025, 09:48 PM
బీజేపీ బలోపేతానికి కృషి చేయాలి Thu, Apr 17, 2025, 09:46 PM
కామారెడ్డిలో 22న ఉద్యోగ మేళా Thu, Apr 17, 2025, 09:43 PM